ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన, హిట్ లిస్టులో అయిదుగురు - వీరికి ఛాన్స్..ముహూర్తం..!?
ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తి కానుండటంతో మార్పులు - చేర్పుల పైన చర్చ మొదలైంది. తొలుత రెండున్నారేళ్ల తరువాత మంత్రివర్గంలో ప్రక్షాళన ఉంటుందని భావించారు. అయితే, మారుతున్న పరిణామాల తో పాటుగా పనితీరు.. భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందుకు ముహూర్తం సైతం ఖరారైనట్లు తెలుస్తోంది.
ఏపీ మంత్రివర్గం ప్రక్షాళన పైన ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. త్వరలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. అక్టోబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. ఈ ఎన్నికల వేళ మంత్రులకు బిగ్ టాస్క్ అప్పగిస్తారని ప్రచారం సాగింది. అయితే, సడన్ గా మంత్రివర్గం పైన ప్రభుత్వ వర్గాల్లో కొత్త చర్చ వినిపిస్తోంది. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రుల్లో పనితీరు.. పార్టీ తో సమన్వయం.. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటంలో వెనుక బడి ఉన్న అయిదుగురు మంత్రుల విషయంలో తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అదే విధంగా కొత్తగా కేబినెట్ లో అవకాశం దక్కించుకునే మంత్రుల పైనా అంచనాలు మూడు పార్టీల్లోనూ మొదలయ్యాయి.

విస్తరణ పై కొనసాగుతున్న చర్చ
ప్రస్తుత కేబినెట్ లో కూటమి లోని మూడు పార్టీల నుంచి మంత్రులు ఉన్నారు. కాగా, బీజేపీకి మరో మంత్రి పదవి పెరగనుందని తెలుస్తోంది. జనసేన నుంచి కొత్తగా మరో మంత్రి కేబినెట్ లోకి వస్తారని చెబుతున్నారు. ఆ స్థానంలో ఒకరిని తప్పించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అదే విధంగా టీడీపీ నుంచి ముగ్గురు మంత్రులను తప్పించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరి స్థానంలో కొత్తగా ప్రాంతీయ - సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త వారికి అవకాశం దక్కనుంది. ఇందు కోసం పలువురు సీనియర్ల పేరు రేసులోకి వచ్చాయి. అయితే.. స్థానిక ఎన్నికల ముందే ఈ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందా.. ఎన్నికల తరువాత చేస్తారా అనేది ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications