నాటీ అంటూ.. ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటున్న హాట్ బ్యూటీ !
నిధి అగర్వాల్.. నిధులు అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ హాట్ బ్యూటీ.. తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. 2022 సంక్రాంతి తర్వాత ఆమె నటించిన ఏ మూవీ ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "హరిహర వీరమల్లు" సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పాలిటిక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దాదాపు 13 సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలానే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది. దాంతో ఈ రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా అమ్మడు మళ్లీ ఫామ్ లోకి వస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల్లో నటిస్తుండడం వల్లే అవి రిలీజ్ ఆలస్యం కావడంతో తెరపై కనిపించట్లేదని అంటున్నారు. సినిమాల పరంగా కోకన్హేమ్ గ్యాప్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని అలరిస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ.

అయితే పవన్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా.. నిధి సోషల్ ఎక్స్ వేదికగా ఫాలోవర్స్‌తో చిట్ చాట్ నిర్వహించింది. అందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ మ్యాటర్స్ కూడా షేర్ చేసుకుంది. ఓ జేటిజం మూవీ ఇండస్ట్రీ గురించి ప్రశ్నించగా.. ఇది చాలా కష్టమైన రంగం. ఎప్పుడైనా ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటే.. సవాళ్లకూ సిద్ధంగా ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఫలితం రావాల్సిన టైమ్‌లో తప్పకుండా వస్తుంది" అని చెప్పుకొచ్చింది.
మళ్లీ నటిస్తారా ? నెంబర్ చెప్తారా ??
ఇక మరో నెటిజన్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో మళ్లీ నటిస్తారా అని అడిగారు. అందుకు వారి లాంటి స్టార్స్ తో నటించాలంటే అదృష్టం ఉండాలి. అవకాశం వస్తే ఇద్దరితోనూ తిరిగి నటిస్తాను అని వెల్లడించింది. మరో నెటిజన్ సరదాగా.. పాప మీ అమ్మ నంబర్ ఇవ్వు.. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను అని అడిగాడు. అందుకు గాను నిధి 'అవునా.. నాటీ' అని రిప్లై ఇచ్చింది. దీంతో ఈ చిట్ చాట్ సెషన్ ఫుల్ వైరల్ అయ్యింది.
Avunaaaa? ☺️ naughty #HariHaraVeeraMallu #AskNidhhi https://t.co/rcWwDm1Egs
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) July 7, 2025
మరోవైపు అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది 'నిధి అగర్వాల్ '. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. పలు వరుస సినిమాల్లో నటించిన అవి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. తమిళ్ లోని ఈ భామ పలు సినిమాల్లో నటించి మెప్పించింది.












Click it and Unblock the Notifications