శని, సూర్యులతో శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులవారికి పండుగ మొదలైంది!
2026 ఆగస్టు ఏడవ తేదీన ముఖ్యమైన ఖగోళ దృక్కోణం ఏర్పడుతుంది. సూర్యుడు మరియు శని గ్రహాలు పరస్పరం సుమారు 120 డిగ్రీల కోణంలో ఉండి అరుదైన నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అరుదైన రాజయోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని, ఆర్ధిక ప్రగతిని, కొత్త అవకాశాలను అందిస్తుంది.
శని, సూర్యుల నవ పంచమ రాజయోగం
సాధారణంగా సూర్యుడు, శని విరోధి గ్రహాలుగా పరిగణించబడతాయి. అయితే ఈ ప్రత్యేక నవ పంచమ రాజయోగంలో మాత్రం వాటి అశుభ ప్రభావాలు బాగా తగ్గుతాయి. శుభ ఫలితాలు పెరుగుతాయి. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాశులు ఏమిటో చూద్దాం.

మేష రాశి: నేటి నుండి నవ పంచమ రాజయోగ ప్రభావంతో మేషరాశి జాతకులకు వృత్తి జీవితం, సామాజిక జీవితంలో మంచి మార్పులు రావచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇష్టమైన స్థలానికి బదిలీ అవకాశం కనిపిస్తుంది.ఈ సమయంలో ఆర్ధిక లాభాలు ఉంటాయి. పని చేసే చోట అధికారుల మద్దతు లభించి, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. సమాజంలో గౌరవం పెరిగి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడుతుంది.
సింహ రాశి: సూర్యుడు ఈ రాశికి అధిపతి కావడంతో నేడు ఏర్పడుతున్న నవ పంచమ రాజయోగం కారణంగా శుభఫలాలు ఎక్కువగా ఉండవచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు, చట్టపరమైన విషయాలు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. పూర్వీకుల ఆస్తి సంబంధిత విషయాల్లో లాభం, బకాయి డబ్బు తిరిగి రావడం జరగవచ్చు. ఆర్థిక స్థితి బలపడి ఈ సమయంలో సింహరాశి వారి గౌరవం పెరుగుతుంది.
తులా రాశి: నేటినుండి నవ పంచమ రాజయోగం కారణంగా తులారాశి జాతకులకు ఆదాయం పెంచే కొత్త మార్గాలు లభించవచ్చు. ఈ సమయంలో అనేక వనరుల నుంచి ధన ప్రవాహం పెరిగి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఈ సమయం మీకు పెట్టుబడులకు అనుకూల సమయం. కుటుంబంలో భేదాభిప్రాయాలు తగ్గి సామరస్యం పెరుగుతుంది. తులారాశి జాతకులకు ఉద్యోగం, వ్యాపారంలో ప్రగతి కనిపిస్తుంది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి నవ పంచమ రాజయోగం కారణంగా నేటి నుండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు సన్నాహం చేస్తున్న విద్యార్థులకు విజయం సాధ్యం. విదేశీ ప్రయాణం లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కృషికి మంచి ప్రతిఫలం లభిస్తుంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications