నక్కతోక తొక్కిన అల్లు అర్జున్
పుష్ప సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ వార్తను సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు ఉధృతంగా షేర్ చేస్తున్నారు.
ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలను ఇచ్చేందుకు బన్నీ లండన్ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అదేకనుక నిజమైతే ఆ ఘనత సాధించిన మరో దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ నిలుస్తారు. ఇప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు అక్కడి మ్యూజియంలో కొలువు దీరాయి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు.

పుష్ప సినిమాతో బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఓర్మాక్స్ మీడియా బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల గురించి సర్వే నిర్వహించి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పుష్ప2 మొదటి స్థానంలో నిలిచింది. ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అనేదానికి ఇది నిదర్శనం. ఇదే సర్వేలో సల్మాన్ ఖాన్ టైగర్3 మూడోస్థానంలో ఉండగా, షారుక్ డుంకీ ఐదోస్థానంలో నిలిచాయి.
మైత్రీమూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న పుష్ప చిత్రానికి నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications