అతనితో బంధం ముగిసింది..అనసూయ సంచలన పోస్ట్
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది
రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చీర కట్టిన ,స్కర్ట్ వేసిన, బికినితో దర్శనం ఇచ్చిన అది అనసూయకే చెల్లింది. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.
చాలా సంవత్సరాలుగా తనతో కలిసి పని చేసిన మేనేజర్ మహేంద్ర గురించి తన పోస్ట్ భావోద్వేగమైన నోటు రాసుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉన్న మేనేజర్ మహేంద్ర ఇక నుంచి తనతో పని చేయరని తెలిపింది. "నాకు మేనేజర్‌గా ఎంతోకాలం పనిచేసిన మిస్టర్ మహేంద్ర ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. ఈ వృత్తిపరమైన ప్రయాణం నాకు చాలానే నేర్పింది. ఇన్నాళ్ల మా అనుబంధంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. సమయం, కృషి, అంకితభావం చూపిన మహేంద్రకు ధన్యవాదాలు" అని అనసూయ చెప్పుకొచ్చింది.
మేనేజర్ మహేంద్రకు అనసూయ తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపింది. ఇక కొత్త మేనేజర్ కోసం వెతుకుతున్నామని, ఆసక్తి ఉన్నవాళ్లు సంప్రదించాలంటూ ఓ మెయిల్ ఐడీని తన పోస్ట్‌లో షేర్ చేసింది. ఇలా తనతో కలిసి ఎన్నో ఏళ్లు పని చేసిన మేనేజర్ మహేంద్రకు అనసూయ వీడ్కోలు పలికారు.












Click it and Unblock the Notifications