'కల్కి' ఏపీలో ఎలా ఆడుతుందో చూస్తా: వైఎస్ జగన్ వార్నింగ్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది. పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కళకళలాడాలంటే ప్రభుత్వాల నుంచి మద్దతు అవసరం. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు అందలేదు. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉండే పవన్ కల్యాణ్ జనసేన రాజకీయ పార్టీ అధినేతగా ఉండటమే అందుకు కారణం. వైఎస్ జగన్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా ఎంచుకొని ఏపీలో సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గించడంతోపాటు ప్రత్యేకంగా షోలు వేసుకునేందుకు, బెనిఫిట్ షోలకు అనుమతివ్వకపోవడంతోపాటు సినిమా విడుదలైన మొదటివారంలో టికెట్ ధరలను పెంచుకునే విధానానికి కూడా స్వస్తి పలికింది.
సినిమా హిట్ అయినా బొటాబొటి కలెక్షన్లే
దీనివల్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలకు కలెక్షన్లు రావడం గగనమయ్యాయి. పవన్ కల్యాణ్ సినిమా యావరేజ్ అని టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు రాబడతాయి. ఇటీవలే రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బొటాబాటిగా వచ్చాయి. ప్రభుత్వం అనుమతులివ్వకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదు. నిర్మాతలకు ఇది కూడా ఓ సమస్యగా మారింది. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై రూ.500 కోట్లకు పైబడిన బడ్జెట్ తో నిర్మాత అశ్వనీదత్ తెరకెక్కిస్తున్న చిత్రం కల్కి . డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమలహాసన్ తదితర భారీ తారాగణం నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది.

చంద్రబాబుతో అశ్వనీదత్ కు సత్సంబంధాలు
ఈ సినిమా నిర్మాత అశ్వనీదత్ కు చంద్రబాబునాయుడితో మంచి సంబంధాలున్నాయి. బాబు జైలుకు వెళ్లిన సమయంలో కూడా చిత్ర పరిశ్రమ నుంచి ముందుగా స్పందించింది ఆయనే. స్వతహాగా అశ్వనీదత్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక భావన ఉంటుంది. ఆయన భారీగా నిర్మిస్తున్న కల్కి చిత్రం ఏపీలో ఎలా విడుదల చేస్తారు? ఏవిధంగా కలెక్షన్లు రాబట్టుకుంటారు? ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీలో ఎలా ఆడుతుందో చూస్తామని బెదిరించిన మాజీ మంత్రులు పలువురు దీన్నిగురించి మాజీ సీఎం జగన్ దగ్గర ప్రస్తావించినట్లు తెలుగు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం మారిపోతే ప్రీరిలీజ్ ఈవెంట్ ఏపీలో చేద్దామని, మారకపోతే హైదరాబాద్ లో చేద్దామని అశ్వనీదత్ నిర్ణయించారు. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమా ఈవెంట్ ఏపీలోనే జరుగుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications