అనుష్క మాస్ జాతర..తట్టుకోవడం కాస్త కష్టమే.. !
అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన 'ఘాటి' ట్రైలర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. సూపర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, 'అరుంధతి' వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, ఈ సినిమాలోనూ అదే తరహాలో రౌద్రంగా కనిపించనుంది.
ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కథ గంజాయి నేపథ్యంలో నడిచేలా ఉంది. "ఘాట్లలో గాటీలు ఉంటారు సార్" అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్‌తో నిండి ఉంది. విక్రమ్ ప్రభుతో రొమాంటిక్ సన్నివేశాలు, ఫైటింగ్ సీన్స్‌తో పాటు, చివర్లో అనుష్క చెప్పే "సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ" అనే డైలాగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమాలో అనుష్క రౌడీలను చితకబాదడం, అడ్డు వచ్చిన వారిని నరకడం వంటి సన్నివేశాల్లో చాలా పవర్ఫుల్‌గా కనిపించింది.

అందమైన అనుష్క చేతితో అలా పీకలు కోయించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ అనుష్క మాస్ జాతర చూడాటానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. తెర మీద అనుష్క కనిపించి రెండేళ్లు కావడంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
రాజీవ్ రెడ్డి ,సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications