ఇక మూడు రోజులు కుండపోతే- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. గత వారం నుంచి అక్కడక్కడా వర్షాలు కొన సాగుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీరు వచ్చి చేరుతుంది. తెలంగాణ లోని అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయ్యాయి. గోదావరి లోకి భారీగా వరద నీరు రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక, రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. అదే విధంగా ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజా అలర్ట్స్ ప్రకారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. వర్షాల కారణంగా ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం ఏకంగా 56 అడుగులకు చేరుకోవడంతో వరద తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications