స్మృతి మంధానలో ఇంత కోపమా? తొలిసారి బయటపెట్టిన షాకింగ్ నిజం!
భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన స్టేడియంలో బ్యాట్ పట్టుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. ఎంతో ప్రశాంతంగా, నవ్వుతూ కనిపించే ఈ స్టార్ క్రికెటర్ లోపల తీవ్రమైన మానసిక సంఘర్షణ, బాధ, కోపం దాగి ఉన్నాయనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కళ్లలో నీళ్లు తిరిగిన వేళ..
ఇటీవల జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన రాత్రి గురించి ప్రశ్నించగా.. స్మృతి మంధాన ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఆమె కల్లు చెమర్చాయి. ముఖంలో తీవ్రమైన బాధ స్పష్టంగా కనిపించింది. అయితే ఆమె ఆ సంఘటన వివరాలను బహిరంగంగా వెల్లడించకుండా వ్యక్తిగత జీవితం కంటే కేవలం క్రికెట్ గురించే మాట్లాడటానికి ప్రాధాన్యత ఇచ్చారు. బహుశా అది ప్రపంచ కప్ ఓటమి సమయం కావచ్చని లేదా కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న మానసిక ప్రతిబంధకాలు కావచ్చునని అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత జీవితంపై బలమైన గీత
ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో వివాహం ఆ తర్వాత బ్రేకప్ గురించి నెట్టింట రకరకాల వార్తలు వచ్చినప్పటికీ.. స్మృతి మంధాన ఎప్పుడూ వాటిపై నేరుగా స్పందించలేదు. ఈ ఇంటర్వ్యూలోనూ ఆమె తన వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ కెరీర్ ను వేర్వేరుగానే ఉంచారు. తనపై వచ్చే విమర్శలను గానీ, వ్యక్తిగత విషయాలను గానీ సానుభూతి కోసం వాడుకోవడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.
బయటికి ప్రశాంతంగా కనిపించినా..!
బయటికి ఎంతో ప్రశాంతంగా, సౌమ్యంగా కనిపించినప్పటికీ తన లోపల చాలా కోపం దాగి ఉందని స్మృతి మంధాన నిష్కపటంగా అంగీకరించారు. "నన్ను ఎవరూ నిస్సహాయురాలిగా భావించవద్దు. నాలోని కోపాన్ని ఎవరిపైనా పగ తీర్చుకోవడానికి ఉపయోగించను" అని పేర్కొన్నారు. ఇతరులను సులభంగా క్షమిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. "నేను ఎదుటివారిని క్షమించగలను, కానీ వారు నాకు చేసిన దానిని ఎప్పటికీ మర్చిపోను" అంటూ అత్యంత శక్తివంతమైన సమాధానమిచ్చారు.
ఫైనల్ పైనే స్మృతి మంధాన దృష్టి
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 175 మ్యాచ్‌లు ఆడి 30.46 సగటుతో 4,692 పరుగులు సాధించిన స్మృతి మంధాన, మైదానంలో తన బ్యాటింగ్‌తోనే సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత్‌ను విజేతగా నిలిపేందుకు తన పూర్తి దృష్టిని ఆటపై కేంద్రీకరించారు.
Raj Shamani was trying hard to make Smriti Mandhana spill something about her last relationship.
— Gagan Choudhary (@trigguuuu) September 13, 2026
But Smriti Mandhana kept beating around the bush 😂 pic.twitter.com/JkecLILgTi












Click it and Unblock the Notifications
