వినాయక చవితికి పూర్ణం బూరెలు ఇలా ట్రై చెయ్యండి..సూపర్ గా ఉంటాయ్!

వినాయక చవితి పండుగకు రకరకాల పదార్ధాలతో నైవేద్యాలు చేసి వినాయకుడికి సమర్పిస్తాం. అలా వినాయకుడికి సమర్పించే నైవేద్యాలలో పూర్ణం బూరెలు ఒకటి. ఇప్పటికే కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాలికలు, పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు పూర్ణం బూరెలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

శనగపప్పు - 1 కప్పు (200 గ్రాములు)
బెల్లం - 1 కప్పు (150-200 గ్రాములు) (తీపి తక్కువగా కావాలంటే ¾ కప్పు)
నీళ్లు - సరిపడా
ఏలకుల పొడి - ½ టీస్పూన్
నెయ్యి - 2 టీస్పూన్
తురుము కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం)
మైదా - 1 కప్పు (120 గ్రాములు)
సెనగపిండి - ½ కప్పు (50 గ్రాములు)
ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి

Traditional Poornalu Purnam Boorelu recipe for Vinayaka Chavithi make with Exact measurements

తయారీ విధానం

ముందుగా శనగపప్పును 3-4 గంటలు నానబెట్టి, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా ఉడికించి నీళ్లు వడకట్టండి. మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకోండి. బెల్లాన్ని నీళ్లలో కరిగించి వడకట్టండి.
బాణలిలో నెయ్యి వేసి శనగపప్పు పేస్ట్ వేసి అందులో బెల్లం పాకం పోసి బాగా కలుపుతూ ఉడికించండి. అందులోనే నెయ్యి, యాలుకల పొడి వేసి బాగా కలపండి.

పూర్ణం పిండి ఇలా చేసుకోవాలి

పూర్ణం పిండి చేతికి అంటుకోకుండా, చేతితో ఉండలు చేసుకునేంత గట్టిపడిన తర్వాత దించి, ఇష్టం అనుకుంటే తురుముకున్న కొబ్బరి కలపండి. చల్లారిన తర్వాత చిన్న ఉండలు చేసుకోండి. తర్వాత మైదా, సెనగపిండి కొలతల ప్రకారం తీసుకుని కొద్దిగా ఉప్పు కలిపి, నీళ్లు కొద్దిగా పోస్తూ మెత్తని పిండి కలవండి. మరీ గట్టిగా, మరీ పలచగా కలపొద్దు. పూర్ణం చేస్తే పిండి పట్టుకునేలా ఉండాలి. పిండి తయారు చేసుకుని 20నిమిషాలు నానబెట్టండి.

బంగారు రంగులో వేయిస్తే పూర్ణం బూరెలు

పిండిని కొద్దిగా తీసుకుని చేతిలో నూనె రాసుకుని చేతలో పలచగా చేసి,.మధ్యలో పూర్ణం ఉండ పెట్టి మూసి గుండ్రంగా చేసుకోండి. నూనె బాగా వేడి చేసి మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేయించండి. అంతే రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ అయినట్టే. పూర్ణం ఎక్కువ మెత్తగా ఉంటే కొద్దిగా సెనగపిండి కలపండి.

బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు.. గణనాధుడు కూడా ఇష్టపడేలా మెచ్చుకునేలా ఇలా చెయ్యండి!
బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు.. గణనాధుడు కూడా ఇష్టపడేలా మెచ్చుకునేలా ఇలా చెయ్యండి!

ఈ చిట్కాలతో క్రిస్పీగా, స్వీట్ గా పూర్ణం బూరెలు

పిండి చాలా గట్టిగా ఉంటే కూడా పూర్ణాలు పగులుతాయి. అందుకే మెత్తగా ఉండేలా చూసుకోండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేయించండి. ఎక్కువసేపు ఉంచకండి. వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత అందరూ తినండి. సాఫ్ట్‌గా, క్రిస్పీగా తియ్యగా ఉండే పూర్ణం బూరెలు అందరికీ ఎంతో నచ్చుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+