నంబర్ 1 ఎకానమీగా భారత్.. అమెరికాను ఎప్పుడు దాటుతుందో తెలుసా?
భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ భారత ఆర్థిక భవిష్యత్తుపై సంచలన అంచనా వేశారు. రాబోయే 25 ఏళ్లలో భారత్ అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరిస్తుందని, ఈ శతాబ్ధంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
25 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక చిత్రపటంలో మార్పులు
జెఫ్రీ సాక్స్ విశ్లేషణ ప్రకారం.. రాబోయే పాతికేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రం నిర్ణయాత్మకంగా ఆసియా వైపు మళ్లుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా, ఇండియాలు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతాయి. ఫలితంగా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న అమెరికా మూడో స్థానానికి పడిపోయే అవకాశం ఉందనేది ఆయన ప్రధాన అభిప్రాయం.

భారత్-చైనా సహకారం
భారత్, చైనాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, అపనమ్మకాన్ని అంగీకరిస్తూనే ఈ రెండు దేశాల మధ్. బలమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అత్యంత కీలకమని జెఫ్రీ సాక్స్ వెల్లడించారు. ఇండియాకు చైనా ఎంత అవసరమో.. చైనాకు కూడా ఇండియా అంతే అవసరమని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య జాయింట్ వెంచర్లు, విదేశీ పెట్టుబడులు పెరిగితే భారత జీడీపీ వృద్ధి రేటు మరింత వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఆసియా
గల 2 వేల ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే 1800 ప్రాంతం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆసియానే కేంద్రంగా ఉండేదని.. ఆ తర్వాత కొంతకాలం పాశ్చాత్య దేశాల వైపు మొగ్గు చూపిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కేంద్రం తిరిగి ఆసియాకు చేరుకుంటోందని వివరించారు. ఈ క్రమంలో ఆసియాన్, ఆఫ్రిక్, గల్ఫ్ దేశాలతో భారత్ ఏర్పరచుకునే వ్యూహాత్మక భాగస్వామ్యాలు ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెడతాయని జెఫ్రీ సాక్స్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
