హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి.. ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజ ఎప్పుడంటే..?

హైదరాబాద్ మహా నగరం వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైంది. నగరంలోని గల్లీ గల్లీలో వినాయకుని మండపాలు దర్శనం ఇస్తున్నాయి. ఎటు చూసినా గణపయ్య నామ స్మరణతో నగరం మారుమోగుతోంది. హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఖైరతాబాద్ మహా గణపతి చవితి వేడుకలకు ముస్తాబైంది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇక సోమవారం ఉదయం 6 గంటల నుంచే మహా గణపతికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ దంపతుల చేతుల మీదుగా తొలి పూజ ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేష్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల కోసం క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బడా గణేష్ ను దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలివస్తున్న క్రమంలో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని అన్నారు.

ఇక ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఛైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా కళాకారులు భాగమయ్యారు. ఒక్కో పనికి ఒక్కో ప్రత్యేక బృందం ఉంటుందని తెలిపారు. 1954 నుంచి ఖైరతాబాద్​ ఉత్సవాలు ఎంతో ఘనంగా కొనసాగుతూ వస్తున్నాయని వివరించారు. ఖైరతాబాద్ గణేష్ ఒక్క అడుగుతో ప్రారంభమై 70 అడుగులకు పైగా విగ్రహం ఎత్తు పెంచుతూ తయారు చేశామని.. అయితే కరోనా అనంతరం ఏటా క్రమంగా ఒక్కో అడుగు ఎత్తు తగ్గిస్తూ వస్తున్నట్లు వివరించారు.

VinayakaChavithi festivities in Hyderabad When is the first puja for the Khairathabad Bada Ganesh

మరోవైపు వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్‌ బడా గణేష్ ను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారని ఈ మేరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. బడా గణేశ్‌ దర్శనానికి వచ్చే వాహనదారులు ఈ విషయం గమనించాలని కోరారు. సెప్టెంబర్‌ 12 నుంచి 24 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. రోజూ ఉదయం 11 నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే రద్దీ ఉన్న ప్రాంతాలను కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను భక్తులు, వాహనదారులు ఎంచుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+