వర్షాకాలంలో కేరళ టూర్ వెళ్లొద్దామా..? తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

కేరళ టూర్ అనగానే చాలామంది ఎగిరి గంతేస్తారు. సాధారణంగా కేరళ టూర్ కు ఎక్కువగా వేసవిలో వెళ్తుంటారు. కానీ వర్షాకాలంలో కేరళ టూర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ వైపు సన్నని వర్షం పడుతుంటే మరోవైపు కేరళలోని ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను ఆస్వాదించే అవకాశం ఉంది. పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రస్ గా ఈ రాష్ట్రం ఉంటుంది. కేరళలో ఎటు చూసినా పచ్చదనం పరిచినట్లుగా ఉంటుంది. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని చెబుతుంటారు. మరి వర్షాకాలంలో కేరళలో తప్పక చూడాల్సిన ప్రదేశాల గురించి ఇక్కడ చూద్దాం..

కేరళ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మున్నార్, అలెప్పీ, వయనాడ్, తెక్కడి, అతిరపల్లి వాటర్ ఫాల్స్, కోవలం, వర్కల బీచ్, మరారి బీచ్, బేకల్ బీచ్, పూవర్ ఐలాండ్ తదితర పర్యాటక ప్రదేశాలు పర్యటకులను కనువిందు చేస్తున్నాయి. మున్నార్ లో ముఖ్యంగా మంచుతో కప్పబడిన టీ ఎస్టేట్స్, చల్లని వాతావరణం పర్యాటకుల మనసును మైమరిపింపజేస్తాయి. ఇక అలెప్పీ కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇక్కడ వర్షం కురిసినప్పుడు బ్యాక్ వాటర్స్ గుండా హౌజ్ బోట్ జర్నీ లైఫ్ లో మరచిపోలేని అనుభూతిని కలిగిస్తోంది.

ఇక వయనాడ్ ప్రాంతంలోని పచ్చని అడవులు, జలపాతాలు ఈ సీజన్ లో టూరిస్టులను కనువిందు చేస్తున్నాయి. అలాగే తెక్కడిలోని స్పైస్ ప్లాంటేషన్స్ చాలా ఫేమస్ గా నిలుస్తున్నాయి. అడవిలో పచ్చదనాన్ని ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ స్పాట్ గా నిలుస్తోంది. ఇక వర్షాల కారణంగా అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సీజన్ లో జలపాతం అందాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. వీటితోపాటు కేరళంలోని కోవలం, వర్కల, మరారి బీచ్, బేకల్ బీచ్, పూవర్ ఐలాండ్ కూడా పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Kerala tour Shall we go on a trip to Kerala during the monsoon season Here are the mustvisit places

అలాగే కేరళలో చూడదగిన ప్రదేశాల్లో వాగమన్, కుమరకోమ్, పెరియార్ నేషనల్ పార్క్, పద్మనాభస్వామి ఆలయం, అలెప్పీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే వీటితో పాటు వర్షాకాలంలో కేరళలో వంటకాలు కూడా చాలా ఫేమస్. అప్పం, స్ట్యూ వంటకం, స్పైసీ చేపల కర్రీ ఇలా చాలా వంటకాలు కేరళలో పర్యాటకుల మనసుల్ని దోచుకుంటున్నాయి. మీరు ఎప్పుడైనా కేరళ టూర్ కు వెళ్తే ఇలాంటి ప్రదేశాలను.. ఇలాంటి వంటకాలను ట్రై చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+