'వెనక నుండి వీడియో తీయొద్దు'.. బాలివుడ్ బ్యూటీ వార్నింగ్..!
స్టార్ హీరోయిన్లు బయట కనబడితే చాలు ఎడా పెడా తేడా లేకుండా ఫోటోలు తీస్తూనే ఉంటారు. సెలబ్రిటీలు కనిపిస్తే కిస్సిక్ మంటూ ఫోటోలు, వీడియోలు తీయడం కామన్ అయిపోయింది. అయితే కొందరు మాత్రం హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. స్టార్లు ఇబ్బంది పడినా.. వద్దని సైగలు చేసినా వినకుండా అలాగే ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా డాన్సింగ్ క్వీన్ గా పేరుగాంచిన ఆయేషా ఖాన్ కు సంబంధించిన ఓ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆయేషా ఖాన్.. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ పై ఫైర్ అయిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో జరిగిన 'Tu Ya Main' మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ఈ షాకింగ్ ఘటన జరిగింది. స్క్రీనింగ్ కు హాజరైన ఆయేషా ఖాన్.. రెడ్ కార్పెట్ పై ఫోటోలకు పోజులు ఇస్తుండగా.. కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెను వెనుక వైపు నుంచి వీడియో తీసేందుకు ట్రై చేశారు. అయితే వెంటనే ఇది గమనించిన ఆయేషా వెంటనే అసహనం వ్యక్తం చేస్తూ వారిని నిలదీశారు.
ఆమె హిందీలో.."ఆప్ ఇజ్జత్ ఖుద్ కమాయేంగే, ఔర్ ఖుద్ హీ గవాయేంగే.. ప్లీజ్ మత్ కరియే, అచ్చా నహీ లగ్తా" అంటూ హిందీలో మాట్లాడారు. అంటే "గౌరవాన్ని మీరే సంపాదించుకుంటారు.. మీరే కోల్పోతారు.. దయచేసి ఇలా చేయకండి.. ఇది మంచిది కాదు" అనే అర్థం వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అయిన నేపథ్యంలో నెటిజన్లు ఆయేషాకు మద్దతు తెలుపుతున్నారు. 'సెలబ్రిటీలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక బాలీవుడ్ నటి అయేషా ఖాన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా పలు చిత్రాలు చేస్తోందీ భామ. రామ్ చరణ్- బుచ్చిబాబు పెద్ది మూవీలో అయేషా ఖాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలోను అయేషా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications