మహేష్‌బాబు చేయాల్సింది బాలయ్య చేశాడు.. బొమ్మ బ్లాక్‌బస్టరే
సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో సన్నిహితంగా ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ అంటే బాలయ్యకు ప్రత్యేక అభిమానం. రాజకీయాల పరంగా తన తండ్రి ఎన్టీఆర్ ను కృష్ణ వ్యతిరేకించినప్పటికీ ఆయన మనస్తత్వం బాలయ్యకు బాగా నచ్చుతుంది. ఆయనతో కొనసాగించిన అనుబంధాన్నే మహేష్ బాబుతో కూడా కొనసాగిస్తున్నారు. సాధారణంగా సినీ పరిశ్రమలో కొన్ని కథలు ముందుగా ఒక హీరో వద్దకు చేరుకోగా డేట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడంలాంటి కారణాలతో వాటిని తిరస్కరిస్తారు. చివరకు అవి మరో హీరో వద్దకు చేరుకోవడం.. అవి బ్లాక్ బస్టర్ అవడం, లేదంటే ఫ్లాప అవడం జరుగుతుంటుంది.
మీరు చేస్తే బాగుంటుందని నిర్మాతలు ఒత్తిడి చేశారు
ఇటువంటి తరహాలోనే ఒక కథ మహేష్ బాబు వద్దకు వచ్చింది. తమిళంలో విక్రమ్ చేసిన సామి సినిమా అతి పెద్ద బ్లాక బస్టర్. దాన్ని మహేష్ బాబుతో చేయించాలని సూపర్ స్టార్ కృష్ణ భావించారు. అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమాను ప్రిన్స్ వదులుకోవాల్సి వచ్చింది. చివరకు ఆ సినిమా బాలయ్య వద్దకు చేరింది. వాస్తవానికి రీమేక్ సినిమాలు చేయడానికి బాలయ్య వ్యతిరేకం. తెలుగు కథలతోనే సినిమాలు చేయాలనేది ఆయన కోరిక. అయితే నిర్మాతలు కచ్చితంగా మీరు ఈ సినిమా చేయాలని, మంచి పేరు వస్తుందని, మీకు సరిగ్గా సరిపోతుందంటూ చెప్పడంతో బాలయ్య ఓకే చేశారు. చివరకు ఆ సినిమా లక్ష్మీ నరసింహా పేరుతో తెరకెక్కి అతి పెద్ద విజయాన్ని సాధించింది.

అతన్ని దగ్గరకు కూడా బాలయ్య రానివ్వడంలేదు
అసిన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలో హీరోకు కూడా చెప్పకుండా హఠాత్తుగా తీసేశారు. అందుకు కారణమేంటో బాలయ్యకు తెలియలేదు. ఈ విషయంలో బెల్లంకొండ సురేష్ కు, బాలయ్యకు గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు బెల్లంకొండ సురేష్ కు ఒక్క సినిమా కూడా బాలయ్య చేయలేదు. అలాగే బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కూడా థియేటర్లలో బాగా ఆడుతూ 80 రోజులకు చేరుకుంది. 100 రోజులకు చేరుకుంటున్న సమయంలో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తన థియేటర్ల నుంచి హఠాత్తుగా తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బాలయ్యతో సినిమా చేయడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నప్పటికీ అతన్ని దగ్గరకు కూడా బాలకృష్ణ రానివ్వడంలేదు.












Click it and Unblock the Notifications