బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఇదే..!
2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఇక ఈ ఏడాది చాలా పాటలు అభిమానులను అలరించాయి. వాటిల్లో టాప్‌లో నిలిచిన సాంగ్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే మహేష్ బాబు స్టామినాతో ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా యావరేజ్‌గా నిలిచినప్పటికీ , ఈ సినిమాలోని ''కుర్చీ మడతపెట్టి '' సాంగ్ మాత్రం సూపర్, డూపర్ హిట్‌గా నిలిచింది. యంగ్ ఎన్టీఆర్ నటించిన ''దేవర'' పార్ట్-1 సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ''ఫియర్ సాంగ్', 'చుట్టమల్లే' పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 'చుట్టమల్లే' సాంగ్ మెలోడీ ఆఫ్ ది ఇయర్ అనిపించుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఏడాది చివర్లో వచ్చి అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సూసేకి' , 'కిస్సిక్', 'పీలింగ్స్' పాటలు పెద్ద హిట్టయ్యాయి. అయితే వీటిల్లో ఏది పెద్ద హిట్ అని చెప్పడం కొంచెం కష్టమే. కానీ మహేష్ బాబు ''కుర్చీ మడతపెట్టి '' సాంగ్ ఈ ఏడాది బెస్ట్ అని సినీ పండితులు తేల్చేశారు.
థియేటర్లతో పాటుగా సోషల్ మీడియాని ''కుర్చీ మడతపెట్టి '' సాంగ్ షేక్ చేసింది. పార్టీలలో, పెళ్లిళ్లలో, కాలేజ్ ఈవెంట్స్, ఊరేగింపులలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించింది. పైగా మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టెప్పులు ఇరగదీయడం ఫ్యాన్స్‌కు కనుల పండుగలా అనిపించింది. సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత పాటలు సంచలనం సృష్టించాయి. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ అన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్‌ని బ్లాస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications