మహేష్ బాబు నిర్మాతగా పవన్ కల్యాణ్ సినిమా

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్, మహేష్ బాబు.. ఇద్దరూ ఇండస్ట్రీలో అజాత శత్రువులని పేరు తెచ్చుకున్నారు. వీరి సినిమాలు కూడా టాక్ తో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్నిచోట్లా భారీ ఓపెనింగ్స్ తెస్తాయి. తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచడంలో ఈ ఇద్దరు హీరోలు పరిశ్రమకు ఎంతో తోడ్పడ్డారు.

తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ కు ఓవర్సీస్ లో ఇంత మార్కెట్ లభించడానికి కారణం వారిద్దరూ వేసిన పునాది. అందుకే ట్రేడ్ పండితులు పరిశ్రమకు రెండు కళ్లులాంటివారని మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ను అభివర్ణిస్తుంటారు. వీరిద్దరూ కలిసి సినిమా కాదుకదా.. కనీసం ఈవెంట్ లో కూడా ఎక్కడా కనపడలేదు. పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అప్పట్లో మహేష్ బాబు ఇచ్చిన ఈ వాయిస్ ఓవర్ ఒక పెద్ద సంచలనాన్ని కలిగించింది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఒక సినిమాకి మహేష్ పరోక్షంగా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

bheemla nayak movie producer mahesh babu

ఆ సినిమా ఏదంటే 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకి నిర్మాత సూర్య దేవర నాగవంశీ తో కలిసి మహేష్ బాబు కూడా కొంత పెట్టుబడి పెట్టాడు. కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన షేర్ వసూళ్ళలో కాస్తంత వాటా కూడా మహేష్ బాబు కి ఇచ్చారంట. ఈ విషయం తాజాగా సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించాడు అనే వార్త తెలుసుకొని అభిమానులు థ్రిల్ కి గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+