అన్నా నీ సినిమాను ఇక ఆ దేవుడే కాపాడాలి..!!
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కోసం ఫ్యాన్స్ తోపాటు సాధారణ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అలాంటి వాటిల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ ఒకటి. వీళ్లిద్దరి కాంబోలో గతంలో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలు వచ్చాయి. అవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా 'ఆదర్శ కుటుంబం'.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 30 న విడుదలైంది. ఈ మూవీలో వెంకటేశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. అలాగే నివేదా పేతురాజ్, రావు రమేశ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.
అయితే విడుదలైన తొలి వారాంతంలోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వెంకటేశ్ నుంచి వస్తున్న ఫ్యామిలీ మూవీ కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడే అసలు పరీక్ష మొదలైంది. సోమవారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. వీకెండ్ లో ఎలాగోలా నెట్టుకొచ్చిన వెంకటేశ్ మూవీ ఇప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక సినిమా చూసిన చాలా మంది ఇది అసలు త్రివిక్రమ్ సినిమాయేనా అని ప్రశ్నిస్తున్నారు. రోజుల తరబడి సాగదీత, పదే పదే మార్పులు, చేర్పుల వల్ల అనుకున్న ఇంపాక్ట్ తెరపై కనిపించలేదని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.

ఇక ఇప్పటికే గుంటూరు కారం ప్లాఫ్ సినిమా తర్వాత ఆదర్శ కుటుంబం తీశారు త్రివిక్రమ్. ఇది కూడా ప్లాఫ్ అయితే త్రివిక్రమ్ నుంచి రాబోయే భారీ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' ను అనిశ్చితిలోకి నెట్టేసిందన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటు త్రివిక్రమ్ సొంత గూడు లాంటి 'హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారినట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అటు వెంకీమామ మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వచ్చే సంక్రాంతికి 'జనవరి 12 విడుదల' అనే సినిమాను సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
