విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న చిరంజీవి, ఆయన కూతురు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 241 మంది మరణించారు.ఇప్పటికే బీఎస్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు మృతదేహాల వెలికితీత ప్రక్రియను పూర్తి చేశాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించనున్నారు. ఇదిలా ఉంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కూతురు సుస్మిత ఓ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా వెల్లడించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
అహమ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసింది .చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది filmy పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతి లో ఎక్కడో ల్యాండ్ అయ్యింది.అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య మా స్వీటీ(సుష్మిత)పాపా ఉన్నారు .ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందంట మా…
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 12, 2025
చాలా సంవత్సరాల క్రితం చెన్నై నుండి బయలుదేరిన ఒక విమానం తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందని, అందులో చిరంజీవి, సుస్మిత ఉన్నారని నాగబాబు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో వారు క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ అనుభవం ఇప్పటికీ వారి మనసులో ఉంది. ఆ విమానంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమార్తె సుస్మిత కూడా ఉండటంతో, ఆ సమయంలో తన బాధ వర్ణనాతీతమని నాగబాబు తెలిపారు. చిరంజీవి, సుస్మిత ఎలా ఉన్నారో అన్న ఆందోళన చెందామని నాగబాబు ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు.

కొంత సమయం తర్వాత, విమానంలో ఉన్న అందరూ సురక్షితంగా ఉన్నారని తెలియడంతో, తాము ఊపిరి పీల్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఒక విమానం తిరుపతిలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన, మెగా బ్రదర్ నాగబాబుకి ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications