'గోదావరి' కేంద్రంగా జగన్ కొత్త స్కెచ్, అనూహ్య నిర్ణయం - కీలక మలుపు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కొత్త లెక్కలు మొదలయ్యాయి. కూటమి- వైసీపీ పోటా పోటీ రాజకీయం పతాక స్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వైసీపీ లక్ష్యంగా కూటమి.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ సమయంలోనే గోదావరి జిల్లాలు కేంద్రంగా మాజీ సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కీలకమైన గోదావరి జిల్లాల పైన మాజీ సీఎం జగన్ ప్రత్యేకంగా గురి పెట్టారు. అక్కడ సమస్యల పైన వేగంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఆ రెండు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వైసీపీకి చెందిన కాపు నేతలు గోదావరి కేంద్రంగాకే కీలక సమావేశం నిర్వహించారు. అదే విధంగా త్వరలో బీసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయించిన నిరనలు గోదావరి జిల్లాల్లో బలంగా నిర్వహించాలని నిర్దేశించారు. కోనసీమ నేతలతో సమావేశం సమయం లో జగన్ గోదావరి కేంద్రంగా భవిష్యత్ కార్యాచరణ పైన పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు.

జగన్ కొత్త కార్యాచరణ
ఇక, గోదావరిలో రైతుల సమస్యల పైన జగన్ వెంటనే స్పందిస్తున్నారు. భీమవరం కేంద్రంగా ఆక్వా రైతుల సమస్య పైన జరిగిన సభలో జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అదే విధంగా ఉండి వంటి కీలక నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్ ను మార్పు చేసారు. వచ్చే ఎన్నిక ల కోసం సిద్దం చేస్తున్నారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు.రేపు (బుధవారం) తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ఇప్పటికే పొగాకు రైతులు జగన్ తో సమావేశం అయ్యారు. రైతుల పక్షాన నిలబడేందుకు తాను వస్తానని చెప్పారు. పర్యటనలో భాగంగా అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు. దీంతో.. గోదావరి కేంద్రంగా జగన్ వరుసగా అమలు చేస్తున్న కార్యచరణ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications