ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి వీళ్లేదు, బిగ్ ట్విస్ట్...!!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఉప ఎన్నిక ఖాయమైంది. ఇప్పటికే అసెంబ్లీ సీటు ఖాళీగా ఉన్నట్లు నోఫికేషన్ జారీ అయింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారం హైకోర్టుకు కెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయొద్దని పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించడానికి వీలులేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆపాలంటూ విజయారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. 2024లో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించకూడదని కోరారు. అప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీ (ECI)ని ఆదేశించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌లో ఎన్నికల సంఘం, దానం నాగేందర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కాగా.. నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ విజయారెడ్డి 2024లో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రావటం.. తిరిగి కాంగ్రెస్ నుంచి దానం పోటీ చేస్తారనే అంచనాల వేళ విజయా రెడ్డి ఈ పిటీషన్ వేసినట్లు తెలుస్తోంది. తొలి నుంచి వీరిద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి.

హైకోర్టులో పిటీషన్ తో
కొంత కాలంగా ఉపఎన్నిక వస్తే ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ తనదేనని విజయారెడ్డి స్పష్టం చేస్తున్నారు. పీజేఆర్ సెంటిమెంట్‌తో పాటు నియోజకవర్గంలో ఆమెకున్న బలమైన పట్టు కారణంగా కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అనర్హత వేటు పడినప్పటికీ దానం నాగేందర్ వర్గం కూడా టికెట్ రేసులో తామే ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరింది. ఈ సమయంలో విజయా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇటు దానం నాగేందర్ ఉప ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే సమాధానం ఇస్తానని చెబుతున్నారు. ఇక.. ఇప్పుడు విజయారెడ్డి ఏకంగా ఎన్నిక నిలుపుదల కోసం కోర్టును ఆశ్రయించటంతో.. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
