బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు - ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..!!
ఏపీలో స్థానిక సంస్థల పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ జారీ చేయాలని ప్రభుత్వం- ఎన్నికల సంఘానికి సూచించింది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సర్ పక్రియ పూర్తియన తరువాత ఎన్నికలు జరపాలనే వైసీపీ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో.. హైకోర్టు తీర్పు వేళ ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
స్థానిక ఎన్నికలు...బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పైన ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 59 శాతం మించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ జీవోలు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని పేర్కొంది. బీసీల జనగణన తరువాత ఎన్నికలు నిర్వహించాలని వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో.. ప్రభుత్వం జీవోల జారీ.. కోర్టు తీర్పు పైన రాజకీయంగా చర్చ మొదలైంది. ప్రభుత్వం కోర్టు లో వచ్చే తీర్పు పైన అవగాహన ఉన్నా.. బీసీలను మోసం చేసే విధంగా జీవోలు ఇచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీంకు వెళ్లాలని డిసైడ్ అయింది.

సుప్రీంకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం
హైకోర్టు తీర్పు పైన ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చ చేస్తోంది. సుప్రీం తీర్పు తరువాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కాగా.. అటు హైకోర్టులో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించిన హైకోర్టు.. ఆరువారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. 'సర్' ప్రక్రియ జరుగుతుందనే కారణంతో ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం సరికాదని పేర్కొంది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్, పరపాలకశాఖ చట్టనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. కొట్టివేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.













Click it and Unblock the Notifications
