అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్న సమయంలో ..చిరంజీవి షాకింగ్ వీడియో వైరల్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది. అయినప్పటికి ఈ వివాదం ముగియలేదు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా తెలుగు అల్లు అర్జున్‌తో పాటు, ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు.

Chiranjeevi video went viral when Allu Arjun was in trouble

రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ వివాదం కాకరేపుతున్న సమయంలో చిరంజీవి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి తమ పెరట్లో పండించిన సొర కాయ గురించి ఓ వీడియో చేశారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఇలాంటి వీడియోలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదనుకుని వెళ్లిపోయారని, ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం లేదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+