అల్లు అర్జున్‌తో డ్యాన్స్ అసౌకర్యంగా అనిపించింది - రష్మిక మందన్న
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. 'పుష్ప 2' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఓవరాల్‌గా 14 రోజుల్లోనే ఈ సినిమా రూ.1500 కోట్లు కలెక్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో పుష్ప భార్యగా నటించిన రష్మిక మందన్నకు కూడా మంచి పేరొచ్చింది. పుష్ప మొదటి పార్ట్‌తో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక, 'పుష్ప 2' మరోసారి నార్త్‌లో కూడా తన హవాను చూపించింది. 'పుష్ప 2' హిట్‌తో ఈ భామ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా పీలింగ్స్ సాంగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. తాజాగా ఈ భామ ఈ సాంగ్‌పై రియాక్ట్ అయింది.

పీలింగ్స్ సాంగ్ రష్మిక మాట్లాడుతూ.. సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందే ఈ పాటను షూట్ చేసినట్టు ఈ భామ తెలిపింది. 5 రోజుల్లోనే ఈ పాట కంప్లీట్ చేసినట్టు రష్మిక చెప్పుకొచ్చింది. అయితే అల్లు అర్జున్ గారితో డ్యాన్స్ చేస్తున్నందుకు మురిసిపోయాను. కానీ, స్టార్టింగ్ కొంచెం భయంగా, అసౌకర్యంగా అనిపించింది. సాధారణంగా నన్ను ఎవరైనా ఎత్తుకుంటే నాకు చాలా భయమేస్తుంది. పాటలో అల్లు అర్జున్ సర్ ఎత్తుకుని స్టెప్పేసినప్పుడు బాగా భయపడ్డాను కానీ ఆ తర్వాత నార్మల్‌గా అనిపించిందని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications