"వారణాసి"లో మహేష్ మొత్తం ఎన్ని పాత్రలు చేస్తున్నారంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

మొత్తం ఐదు పాత్రల్లో మహేష్..
కాగా ఈ భారీ అడ్వెంచరస్ చిత్రం గురించి సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఇప్పుడు ఈ సినిమాలోని మహేష్ బాబు పాత్రలకు సంబంధించి ఓ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని చర్చ నడుస్తుంది.
ఈ ఐదు పాత్రలలో 'రుద్ర' అనే క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అని.. అదే ప్రధాన పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే రాముడి రూపంలోనూ, శివుడి పాత్రలోనూ మహేష్ కనిపిస్తారని అంటున్నారు. వీటితో పాటు మరో రెండు విభిన్నమైన గెటప్స్ లో కూడా సూపర్ స్టార్ అలరిస్తారని నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇక ఇప్పటికే 'రుద్ర' పాత్రలో మహేష్ బాబు .. ఎద్దుపై కూర్చుని త్రిశూలం పట్టుకొని ఉన్న గ్లింప్స్ ఈవెంట్‌లో విడుదల అయ్యింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఈ చిత్రంలో 'మందాకిని' అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఫస్ట్ లుక్‌లో చీర కట్టులో గన్ పట్టుకుని యాక్షన్ చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అలానే నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన 'కుంభ' అనే పాత్రలో కనిపిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications