అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చే..!!
తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించడమే కాకుండా మరికొన్ని సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా దక్కించుకుంది. కానీ ఎందుకనో ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు.. అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఈషా నటించిన చాలా సినిమాలు విజయం సాధించినప్పటికీ ఆ విజయాలు ఎందుకనో ఈ బ్యూటీ ఖాతాలో పడలేదు. దీంతో ఈ స్వీట్ బ్యూటీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతోంది.
రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా లాంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. సితార బ్యానర్ మీద నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనే ఒక ప్రత్యేక పాటలో ఈషా నర్తించినట్లు సమాచారం. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతుండటంతో స్టార్ హీరోయిన్లు సైతం ప్రత్యేక పాటలు చేస్తున్నారుకదా.. తాను కూడా చేస్తే తప్పేంటి? అనే ఆలోచనతోనే స్పెషల్ సాంగ్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ పూర్తయింది. పలు వాయిదాల అనంతరం మార్చి ఎనిమిదో తేదీన విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. ఇలా సినిమా పదే పదే ఆలస్యమవుతుండటంతో ఒక మంచి హీరోయిన్ తో ఒక ప్రత్యేక గీతం తీస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై బజ్ తగ్గకుండా ఉంటుందని నిర్మాతలు భావించారు. ఆ ఆలోచనకు అనుగుణంగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఈషారెబ్బా స్పెషల్ సాంగ్. ఎంతవరకు సినీ ప్రియులను ఈషా ఆకట్టుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications