ఓటీటీలో మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్ ఇదే.. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్

టాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్లర్, హారర్ మూవీస్ తక్కువగానే వస్తుంటాయి. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఎలెవన్' ఒకటి. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. థియేటర్లలో విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకున్న ఈ వైవిధ్యమైన చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ అవుతూ థ్రిల్లర్ ప్రియులను విశేషంగా అలరిస్తోంది.

ఈ సినిమా గ్రిప్పింగ్ కథనం ఊహించని మలుపులతో డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లపై దూసుకుపోతోంది. ఉత్కంఠభరిత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలో నవీన్ చంద్ర ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అరవింద్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఒక కవలల పాఠశాల నేపథ్యంగా వరుసగా జరిగే భయంకరమైన హత్యల చుట్టూ ఈ కథ ఆసక్తికరంగా తిరుగుతుంది. ఎంతో ప్రతిభ, మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ, ఈ మిస్టీరియస్ సీరియల్ కిల్లర్‌ ను పట్టుకోవడం ఇన్వెస్టిగేషన్ అధికారి అరవింద్‌ ‌కు ఊహించని సవాలుగా మారుతుంది. సైకలాజికల్ ట్విస్టులు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఎలెవన్ సినిమా బడ్జెట్, వసూళ్లు

దర్శకుడు లోకేష్ అజ్లసస్వయంగా స్క్రీన్‌ప్లే అందిస్తూ ప్రతి సన్నివేశాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు. ఈ చిత్రంలో నవీన్ చంద్రతో పాటు శశాంక్, రియా హరి, అభిరామి, ఆడుకాలం నరేన్ తదితరులు కీలకమైన పాత్రలలో తమ నటనతో అలరించారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అజ్మల్ ఖాన్, రియా హరి సుమారు రూ. 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్ల వద్ద దాదాపు రూ. 7 కోట్ల రూపాయలను వసూలు చేసి ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

Eleven Movie Review Naveen Chandra s Brilliant Investigative Crime Thriller Is a Must-Watch on OTT

సాధారణ క్రైమ్ సినిమాలకు భిన్నంగా ఉండే ఈ కథలో మానసిక సంఘర్షణలు, మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. తెరపై నటీనటుల సహజ సిద్ధమైన నటన, గగుర్పాటు కలిగించే నేపథ్య సంగీతం సినిమా ఉత్కంఠను మరింత పెంచాయి. ముఖ్యంగా కథా గమనాన్ని మలుపు తిప్పే ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోతులను దర్శకుడు తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో విజయం సాధించారు. ప్రస్తుతం ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'జియోహాట్‌ స్టార్' వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఉత్కంఠభరితమైన నేపథ్యం, నవీన్ చంద్ర అద్భుత నటన, అద్భుతమైన క్లైమాక్స్ విశేషాలను వీక్షించడానికి ఈ చిత్రాన్ని తప్పకుండా చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+