తీవ్రస్థాయికి రామ్‌చరణ్ - అల్లు అర్జున్ విభేదాలు?

కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా నలుగుతున్న విషయం ఏదన్నా ఉందా? అంటే.. అది అల్లు అర్జున్‌కు సంబంధించిన విషయం అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీతో అతనికున్న విభేదాలే దీనికి కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ కు విభేదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ అనే గొడుగు నీడన కాకుండా తనంతట తాను సొంతంగా ఎదగాలని, అల్లు అర్జున్ గానే ఎదుగుదల ఉండాలని బన్నీ అభిలషించి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళుతున్నారు.

అది నచ్చలేదంటున్న మెగా ఫ్యామిలీ
ఈ ఒక్క ప్రయత్నమే మెగా కుటుంబ సభ్యులకు నచ్చలేదంటున్నారు. ప్రతి వ్యక్తి తనకు తాను సొంతంగా ఎదగాలనుకుంటాడు. మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి అనే గొడుగు ఉంటుంది. ఆ గొడుగు కిందే నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్ కూడా ఉన్నారు. రామ్ చరణ్ తో ఈ విషయమే కాకుండా మరో విషయంలో కూడా అల్లు అర్జున్ కు పొసగలేదంటున్నారుకానీ ఆ విషయం ఏమిటనేది బయటకు రాలేదు. ఇలా మెగా కుటుంబానికి, బన్నీకి దూరం పెరిగింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య విభేదాలు బయటకు కనపడటంలేదుకానీ తీవ్రస్థాయికి చేరాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

extreme differences between ram charan and allu arjun

సొంతంగా ఎదగడం తప్పా?
ఒక వ్యక్తి సొంతంగా ఎదగాలనుకోవడం తప్పా? అని బన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై అల్లు ఆర్మీకి, మెగా ఫ్యాన్స్ కు సామాజిక మాధ్యమాల్లో యుద్ధం నడుస్తోంది. అంతేకాకుండా గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో బన్నీ పాల్గొన్నారు. ఆ సమయంలో అభిమానులు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమంటే 'చెప్పను బ్రదర్' అని వ్యాఖ్యానించారు. దీంతో పవన్ అభిమానులకు బన్నీ అంటే మండిపోయింది. తర్వాత విడుదలైన సినిమా ఫ్లాపైంది.

తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్వీట్ ద్వారా పవన్ కు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి స్వయంగా వైసీపీ అభ్యర్థి కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడంతో మెగా అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిన చెట్టు కొమ్మను నరుక్కుంటున్నావంటూ మండిపడ్డారు. మెగా అభిమానులు ఆగ్రహంగా ఉండటంతోనే పుష్ప2 వాయిదా పడటానికి కారణమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+