'వస్తావా'?... అని డైరెక్ట్‌గానే అడిగారు: తెలుగు నటి ఆవేదన

సినిమా పరిశ్రమ అన్న తర్వాత ప్రతిచోటా క్యాస్టింగ్ కౌచ్ ఉంటోంది. ఇటీవలే మళయాళ చిత్ర పరిశ్రమపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతి పరిశ్రమలోను క్యాస్టింగ్ కౌచ్ సాధారణంగా చోటుచేసుకునేదే అని చాలామంది నటీమణులు ఎన్నో సందర్భాల్లో తెలిపారు. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తమిళ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడినందుకు సింగర్ చిన్మయిని కొన్నాళ్లు పరిశ్రమ నుంచి వెలివేశారు. తప్పు జరుగుతుందని ఎత్తిచూపినందుకు ఇలా చేశారంటూ చిన్మయి వాపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాద్వారా బలంగా ఆమె తన వాయిస్ ను వినిపిస్తోంది.

చేదు అనుభవాన్ని పంచుకుంది
జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇచ్చినట్లుగానే ప్రతి పరిశ్రమలోను అలాగే చేయాలని సెలబ్రిటీలంతా కోరుతున్నారు. ఇటువంటి సమయంలోనే సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకొని తర్వాత బుల్లితెరపై రాణిస్తున్న రాగిణి గతంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది. మహిళలపై లైంగిక వేధింపులు అనేవి ఒక్క వెండితెరపైనే కాదని బుల్లితెరపై కూడా తప్పడంలేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

famous actress ragini sensational comments on casting couch

తక్కువ సినిమాల్లోనే నటించా
నటిగా బిజీగా ఉన్న సమయంలో గతంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. నటిగా రాణించాలనే గొప్ప ఆశయంతో పరిశ్రమలోకి అడుగు పెట్టానని, అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల తక్కువ సినిమాల్లోనే నటించాల్సి వచ్చిందన్నారు. సినీ పరిశ్రమలో తెలిసినవారిని మనం బాగున్నావా అని అడిగితే కింద నుంచి పై వరకు చూస్తారని, కొందరైతే డైరెక్ట్ గానే వస్తావా? అని అడుగుతారని రాగిణి చెప్పింది.

అలా ఎంతోమంది తనను అడిగారంది. ఆ సమయంలో చెప్పలేనంత బాధ అనుభవించాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవాలని తాను ఎంతో కష్టపడ్డానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా నటించానంది. ప్రస్తుతం రాగిణి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+