హమ్మయ్య... మీనాక్షి చౌదరిని చూపించారయ్యా..!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.

చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ కావడం, 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట కథానాయికగా పూజాహెగ్డేను ఎంపిక చేశారు. డేట్లు సర్దుబాటు కుదరక ఆమె తప్పుకోవడంతో హీరోయిన్లకు సంబంధించిన లెక్కలన్నీ మారిపోయాయి. శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్ డేట్ వచ్చినా అందులో మహేష్ బాబుతో పాటు శ్రీలీల మాత్రమే కనపడుతూ వస్తోంది.

guntur kaaram movie latest poster maheshbabu and meenakshi chaudhari

ఓమై బేబీ, కుర్చీ మడతపెట్టి పాటల్లో కూడా శ్రీలీలే కనిపించింది. కొంపదీసి ఈ సినిమాలో మీనాక్షి చౌదరి లేదా? లేదంటే చిన్నపాత్రకు ఏమైనా పరిమితమైందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ సినిమా యూనిట్ మీనాక్షి చౌదరి లుక్ ను విడుదల చేసింది. ఆమెతోపాటు మహేష్ బాబు కూడా ఉన్నారు. హాఫ్ శారీలో ఎంతో సాంప్రదాయంగా, అందంగా మీనాక్షిచౌదరి కనపడింది. ఈ పోస్టర్ లో మీనాక్షి లుక్ చూస్తుంటే అందరికీ పూజా హెగ్డేనే గుర్తుకొచ్చింది. పూజా బదులుగా మీనాక్షి నటించిందా? లేదంటే శ్రీలీల నటించిందా? అనే విషయంలో స్పష్టత రావాలంటే సినిమా విడుదలయ్యేవరకు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+