Hanuman: ప్రశాంత్ భయ్యా.. నక్క తోక తొక్కావు పో.. రూ.1000 కోట్ల ఆఫర్..!
హనుమాన్ మూవీ దండయాత్ర కొనసాగుతోంది. చిన్ని సినిమాగా వచ్చి భారీ కలెక్షన్లు సాధిస్తోంది. తెలుగులో మొదట్లో ఈ మూవీ థియేటర్లు దొరకలేదు. పెద్ద సినిమాలు ఉండడంతో ఈ మూవీకి థియేటర్లు కేటాయించలేదు. కానీ.. సినిమాలో సత్తా ఉండడంతో పెద్ద సినిమాలను వెనక్కు నెట్టి ముందుకు దూకెళ్తోంది హనుమాన్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అద్భుతం చేసింది. హనుమాన్ సినిమా ఇప్పటి వరుక రూ.275 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ రూ.300 కోట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్రెండింగ్ వ్యక్తిగా నిలిచారు. ఈ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ హనుమాన్ కు సిక్వెల్ కూడా తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయనకు భారీగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నాయని టాక్.

ప్రశాంత్ వర్మ సినిమా తీస్తే రూ.1000 కోట్లు పెట్టడానికి కొన్ని నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హనుమాన్ మూవీ తర్వాత తనకు రూ.100, రూ.200 కోట్ల బడ్జెట్ సినిమా ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఓ దశలో రూ.1000 కోట్ల బడ్జెట్ సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు చెప్పేశాడు. ఈ మూవీ చూసిన ఓ ఎన్నారై ఈ భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రశాంత్ వివరించాడు.
ఇతిహాసాలతో మూవీ చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సదరు ఎన్నారై చెప్పినట్లు ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు. అయితే మూవీ తీయడానికి బడ్జెట్ ముఖ్యం కాదన్నారు. చెప్పిన బడ్జెట్ లో సినిమా తీసే దర్శకుడిని కాదన్నారు ప్రశాంత్ వర్మ. తను రూ.10 కోట్ల బడ్జెట్ తో మూవీ చేస్తే దాన్ని రూ.50 కోట్ల మూవీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు. ఒక వేళ ప్రశాంత్ వర్మ రూ.1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే రికార్డు సృష్టించినట్లు అవుతోంది.












Click it and Unblock the Notifications