ప్లీజ్... మీరు మాత్రం ఇంకోసారి నా దగ్గరకు రావొద్దు

పాన్ ఇండియా రెబల్ స్టార్, దేశ ప్రజలందరూ ఎంతో ఇష్టంగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పాత రికార్డులను బద్దలు కొడుతూ, కొత్త రికార్డులను సృష్టించుకుంటూ ముందుకు వెళుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ మీద నిర్మాత అశ్వనీదత్ ఎంతో నమ్మకం ఉంచి రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నమ్మకాన్ని నాగ్ అశ్విన్ వమ్ము చేయలేదు. సైన్స్ ఫిక్షన్ తో పురాణాలను ముడిపెట్టిన తీరుపై దేశ ప్రజలంతా నిబిడాశ్చర్యానికి లోనయ్యారు.

ఒక్క వాణిజ్య ప్రకటన కూడా చేయలేదు
వారిని ఈ పాయింట్ బాగా ఆకట్టుకుంది. దీంతో కల్కి రెండో భాగంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. కర్ణుడి పాత్రలో ప్రభాస్ వీరోచితాన్ని చూడాలని అభిమానులంతా తహతహలాడుతున్నారు. బాహుబలి2తో దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ మారిపోయారు. భవిష్యత్తులో ఆయన స్థానాన్ని అధిరోహించేవారు కనుచూపుమేరలో కనపడటంలేదు. అటువంటి ప్రభాస్ ఇంతవరకు ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించలేదు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ల దగ్గర నుంచి మీడియం రేంజ్ ఉన్న బ్రాండ్ల వరకు.. అన్ని కంపెనీలవారు యాడ్స్ లో నటించాలంటూ క్యూ కట్టారు.

hero Prabhas has not acted in commercial advertisements

డార్లింగ్ పై ఫిదా అవుతున్న సినీ ప్రియులు
అయితే డార్లింగ్ కు మొదటినుంచి వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఇష్టం ఉండదు. బాహుబలి2 తర్వాత, సాహో తర్వాత, సలార్ తర్వాత, తాజాగా కల్కి విడుదలైన తర్వాత కూడా కంపెనీల ప్రతినిధులు ప్రభాస్ ను కలుస్తూనే ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం వారితో దయచేసి తనదగ్గరకు మరోసారి రావొద్దని, తనకు యాడ్స్ లో నటించడం ఇష్టంలేదని, ఏ బ్రాండ్లను తాను ప్రమోట్ చేయనని స్పష్టంగా చెప్పి పంపేస్తున్నారు. అయినప్పటికీ వందల కోట్ల రూపాయల పారితోషికాన్ని ఒక్క యాడ్ కోసం ఆఫర్ చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిని కూడా డార్లింగ్ సున్నితంగా తిరస్కరించారు. ఆయనకున్న నిబద్ధత చూసి దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+