రిలేషన్‌లో ఉన్నట్టు ఓపెన్‌గా చెప్పిన హీరోయిన్ కృతి శెట్టి
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఓ రెండేళ్లు వరుస సినిమాలతో అదరగొట్టింది. నితిన్, నాగ చైతన్య, రామ్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అయితే కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ఆమెకు కొద్దిగా అవకాశాలు తగ్గాయి. ఇదే సమయంలో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడంతో కృతి శెట్టి కాస్తా డల్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో రెండు సినిమాలు. ఇదే సమయంలో ఈ భామకు తమిళంలో వరుస ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి తెలుగులో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మనమే చిత్రంలో హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ జూన్7న విడుదల కాబోతుంది.

సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కృతి శెట్టి పలు ఆసక్తర అంశాలను పంచుకోవడం జరిగింది. ప్రమోషన్స్‌లో భాగంగా యాంర్ మీరు రిలేషన్‌లో ఉన్నారా అని అడగ్గా అవును అని సమాధానం ఇచ్చింది. దీంతో ఎవరితో అని మరోసారి ప్రశ్నించగా, నేను నా ఫ్రొఫెషన్, నా వర్క్‌తో రిలేషన్‌లో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కృతి శెట్టి నటించిన మనమే చిత్రం విడుదలై మంచి సక్సెస్ అందుకుంటే ఈ అమ్మడుకు తెలుగులో మళ్లీ అవకాశాలు పెరిగే అవకాశాలుయ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపైనే ఈ భామ ఆశలన్నీ కూడా పెట్టుకుంది.












Click it and Unblock the Notifications