అల్లు అర్జున్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్మిక?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప2 విడుదల తేదీ ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదా పడింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏపీ రాజకీయాలని చెప్పొచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో జనసేన తరఫున పిఠాపురం నుంచి పోటీచేసిన పవన్ కల్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు అల్లు అరవింద్ కూడా ప్రచారం చేశారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ తో సరిపెట్టారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మెగా అభిమానులు
ట్వీట్ చేసిన తర్వాతరోజే నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డికి మద్దతుగా తన సతీమణితో కలిసివెళ్లి మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో ఆయన ఘోరపరాజయం పాలయ్యారు. పవన్ గెలిచిన తర్వాతకూడా బన్నీ ఒక ట్వీట్ తో సరిపెట్టారు. ఈ సంఘటనలతో మెగా అభిమానులంతా అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాగే ఒకసారి పవన్ కల్యాణ్ అభిమానులతో గొడవ జరగ్గా ఆ సమయంలో విడుదలైన నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే సినిమా డిజాస్టరైంది. పుష్ప2కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమోనని నిర్మాతలు ముందు జాగ్రత్తగా డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేశారంటున్నారు.

heroine rashmika angry to icon star allu arjun

టెన్షన్ పడుతున్న రష్మిక
డిసెంబరు ఆరోతేదీన పుష్ప2తోపాటు కథానాయిక రష్మిక నటించిన మరో చిత్రం చావా విడుదలవుతోంది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించాడు. ఛత్రపతి శివాజీ జీవిత కథతో ఈ సినిమా రూపొందుతోంది. రెండు సినిమాలు ఒకేరోజు విడుదలైతే అభిమానులు ఏ సినిమా చూస్తారు అనే విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాకుండా ఉంటుందని రష్మిక టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప2 తనకు లైఫ్‌ను ఇవ్వగా చావా లైఫ్ ఇవ్వబోతోంది. ఈ విషయంలో రష్మిక బన్నీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోందంటూ ప్రచారం నడుస్తోంది. రాజకీయాల జోలికి వెళ్లకుండా సినిమాలు చూసుకుంటే సరిపోయేది.. పవన్ కల్యాణ్ అభిమానులతో మాట్లాడే విషయంలో నోరు అదుపు చేసుకుంటే బాగుండేదని, కానీ అలా చేయకపోవడంవల్లే ఇప్పుడు అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని రష్మిక అభిమానులు కూడా బన్నీపై మండిపడుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+