ఎన్టీఆర్ సినిమా కోసం రష్మిక సన్సేషనల్ కండిషన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రాన్ని పూర్తిచేసి హిందీ చిత్రం వార్2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను తారక్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేశారు ప్రశాంత్ నీల్. అయితే తారక్ సినిమాలో చేయడం తనకు సమ్మతేమనని, అయితే తనది ఒక షరతు అంటూ రష్మిక ప్రశాంత్ నీల్ కు చెప్పింది.

రూ.7 కోట్ల డిమాండ్
అది ఏమిటంటే.. డీ గ్లామర్ రోల్ అయితే చేయను అని చెప్పింది. పుష్ప మొదటి భాగంలో, రెండో భాగంలో.. రెండూ డీగ్లామర్ పాత్రలే చేసింది. మధ్యలో విడుదలైన యానిమల్ సినిమాలో రొమాన్స్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడం, ఎన్టీఆర్ హీరో కావడంతో సినిమాను ఒప్పుకోవడంతోపాటు పారితోషికం రూ.7 కోట్లు డిమాండ్ చేసింది. రష్మికను నటింపచేయాలనుకుంటున్నారు కాబట్టి రాజీపడకుండా దర్శకుడు ఆమెను ఎంపిక చేశారు. వేరే హీరోయిన్ అనుకోకుండా మొదటి నుంచి దర్శకుడు ప్రశాంత్ నీల్ రష్మికవైపే మొగ్గుచూపారు.

heroine Rashmika only one condition for junior NTR and prashanth neel movie

డీగ్లామర్ వల్ల కెరీర్ పాడవుతుంది

వరుసగా డీగ్లామర్ ఒప్పుకోవడంవల్ల కెరీర్ దెబ్బతింటుందని, అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూడటం కష్టమవుతోందనే భావనలో ఉన్న రష్మిక ఈ ఒక్క షరతును తారక్ సినిమాకు పెట్టింది. అయితే అటువంటిదేమీ లేదని, గ్లామర్ పాత్రే అని చెప్పడంతో ఒప్పుకుంది. ప్రస్తుతం పుష్ప2తోపాటు మరికొన్ని సినిమాలను కూడా రష్మిక చేస్తోంది.

ఒక ఫంక్షన్ లో హీరో మహేష్ బాబు కూడా రష్మికను కొనియాడారు. దేశంలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలు చేస్తోందని, ఈ అమ్మాయికి తిరుగులేదంటూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. తెలుగులో విజయ్ దేవరకొండతో కొత్తగా ఓ సినిమా ఒప్పుకుంది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయికానీ దీనిపై వారిద్దరూ ఇంతవరకు స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+