రామ్‌చరణ్‌పై సంచలన పోస్ట్ చేసిన సమంత

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఎస్ జే సూర్య, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. షూటింగ్ మధ్యలో ఆపేసి భారతీయుడు2పై శంకర్ దృష్టిపెట్టడంతో సినిమా షూటింగ్ ఆలస్యంగా సాగింది. ఈ సినిమాను డిసెంబరు 20వ తేదీన విడుదల చేయాలని వార్తలు వస్తున్నాయి. అయితే మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.

స్పందించిన సమంత
చిరంజీవి విశ్వంభర చిత్రం సంక్రాంతికి విడుదల కావడంలేదు. ఆ స్థానంలో గేమ్ ఛేంజర్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా రామచ్చా.. మచ్చా పాటను విడుదల చేయగా అందులో మాస్ స్టెప్పులతో చెర్రీ ఆకట్టుకున్నాడు. ఈ పాటకు సంబంధించి తాను చాలా ఆనందించానని, మీరు కూడా ఆనందిస్తారని భావిస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై కథానాయిక సమంత స్పందించింది. అన్ మ్యాచ్ బుల్ అంటూ కామెంట్ పెట్టింది.

heroine samantha shared post on ramcharan gamechanger song

ఎవరూ మ్యాచ్ చేయలేరు అని అర్థం
అంటే నిన్ను ఎవరూ మ్యాచ్ చేయలేరు అనే అర్థం వస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రీన్ షాట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్ పై ఓ సినిమా చేస్తోంది. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంబించింది. త్వరలోనే మరో వెబ్ సిరీస్ లో నటించబోతోంది. తమిళంలో విజయ్ సరసన, హిందీలో షారుక్ సరసన అవకాశాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయికానీ వాటిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు. రామ్ చరణ్ కూడా శంకర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+