మరో వివాదంలో త్రిష.. ఆ హీరో నుంచి రూ. 5 కోట్లు ఎందుకు తీసుకుంది?
హీరోయిన్ త్రిషను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే తమిళ నటుడు మన్సూర్ అలీ త్రిషను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే త్రిష మరో వివాదంలో చిక్కుకున్నారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హీరోయిన్ త్రిష ఎమ్మెల్యేతో ఒకరాత్రి గడిపినందుకు రూ.25 లక్షల రూపాయిలు చెల్లించారని అన్నాడీఎమ్‌కే నాయకుడు ఏవీ రాజు వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా త్రిషకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. త్రిష ఓ హీరో నుంచి రూ. 5 కోట్లు తీసుకుందనే ఈ వార్త సారాంశం. అసలు త్రిష ఎందుకు రూ. 5 కోట్లు తీసుకుందనే విషయం తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. త్రిష తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ఓ స్టార్ సినిమాలో త్రిషను ఎంపిక చేసిన తరువాత ఆమెను తప్పించాల్సి వచ్చిందట.

సదరు హీరోకు త్రిష నచ్చకపోవడం వల్లే ఆ సినిమా నుంచి త్రిషను తప్పించారట. త్రిష తప్పుకుంటే అందులో తనకు ఇష్టమైన హీరోయిన్ నటిస్తుందని.. అందుకుగాను త్రిషకు రూ 5 కోట్ల ఆఫర్ ఇచ్చాడట హీరో . వాటిని తీసుకొని త్రిష ఆ సినిమా నుంచి తప్పుకుందట. అయితే రూ.5 కోట్లు కావాలని త్రిషనే డిమాండ్ చేసిందని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది వారు స్పందిస్తే గానీ తెలియదు.
ఇక త్రిష కెరీర్ విషయానికి వస్తే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె దూసుకుపోతున్నారు. పొన్నియిన్ సెల్వన్, లియో వంటి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. దాదాపు 18 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది.












Click it and Unblock the Notifications