స్టార్ హీరోకు షాక్.. సినిమా నుంచి తప్పుకున్న త్రిష
నాలుగు దశాబ్దాల వయసులో కూడా బిజీగా ఉంటూ హీరోయిన్ గా దూసుకువెళుతున్న చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉంది. ఐశ్వర్యారాయ్ ను మించిన అందంతో అందరినీ ఆకట్టుకోవడమేకాదు.. నిర్మాత, దర్శకులు, హీరోలకు ఆమే మొదటి చాయిస్ గా మారింది. తాజాగా ఈ అమ్మడు తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సగం షూటింగ్ కూడా పూర్తయినప్పటికీ ఎందుకు సినిమా నుంచి తప్పుకుందో అర్థంకాక అందరూ అయోమయానికి గురవుతున్నారు.
కీలక సన్నివేశాల చిత్రీకరణ
అజిత్ తన 62వ సినిమా విడాముయార్చి ని తిరుమేని దర్శకత్వంలో చేస్తున్నారు. గతేడాది మే 1న ప్రారంభోత్సవం జరుపుకుతంది. మూడునెలలు అజర్ బైజాన్ లో షూటింగ్ జరిగింది. అజిత్ తోపాటు త్రిష, అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. అజిత్-త్రిష జోడీ మరోసారి తెరపైకి రాబోతుండటతో అభిమానులు కూడా ఆనందపడ్డారు. మిలన్ మరణించినప్పటికీ ఎక్కడా ఆలస్యం లేకుండా షూటింగ్ జరిగింది.

అజర్ బైజాన్ లో భారీ ఖర్చు
అజర్ బైజాన్ లో జరిగిన షెడ్యూల్ ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షెడ్యూల్ ను పూర్తిచేయలేకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 15నే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. తాజాగా ఒక విషయం మాత్రం బయటకు వచ్చింది. హీరోయిన్ త్రిష సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బడ్జెట్ సమస్యలవల్ల కొంత ఆలస్యంగా షెడ్యూల్ చేద్దామని లైకా ప్రొడక్షన్స్ నిర్ణయించుకుంది.
ఈ విషయంలో అజిత్ కూడా ఓకే చెప్పారు. దీనివల్ల త్రిషకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం థగ్ లైఫ్, విశ్వంభర లాంటి సినిమాలతో బిజీగా ఉంది. వీటికి డేట్లు కేటాయించడంతో విడాముయార్చికి డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఎదురైంది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కు చెప్పి సినిమా నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications