ఆ పని చేయనని దేవుడిపై ఒట్టేశా.. ఇప్పటికీ అందరూ తిడుతున్నారు - సప్తగిరి
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ నటుడు, కమెడియన్ సప్తగిరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేసి ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పరుగు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. కందిరీగ, దరువు, గబ్బర్ సింగ్, జులాయి, ప్రేమ కథా చిత్రమ్, లవర్స్, రాజు గారి గది, ఎక్స్ ప్రెస్ రాజా, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.
కమెడియన్ గానే కాకుండా హీరోగాను పలు సినిమాల్లో నటించారు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్ బీ సినిమాల్లో హీరోగా చేసిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సప్తగిరి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం 'పెళ్లి కాని ప్రసాద్'. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండగా.. మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సప్తగిరి మాట్లాడుతూ.. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని తన మనసులో మాటని బయటపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కమెడియన్‌గా, హీరోగా, నిర్మాతగా పని చేస్తున్నానని.. అయితే ఇప్పటికీ తనను విమర్శిస్తూనే ఉంటారని వాపోయారు. నువ్వు కమెడియన్‌గా పని చేసుకోక హీరోగా చేయడం ఏంటని అడుగుతూ ఉంటారని చెప్పారు. హీరోగా చేస్తే కామెడీ పాత్రలు తగ్గుతాయని చెబుతుంటారని అన్నారు.
అయితే తానేంటో తనకు తెలుసని.. అవతలివారి కోసం తాను బ్రతకనని తేల్చి చెప్పారు. అంతే కాకుండా 23 ఏళ్ల క్రితం మాంసం తినడం ఆపేస్తానని వెంకటేశ్వరస్వామి మీద ఒట్టేశానని.. నాటి నుంచి ఇప్పటి వరకు ఏనాడూ నాన్ వెజ్ తినలేదని వెల్లడించారు. ఇక లవ్ అంటేనే అసహ్యం అని.. కానీ మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలానే తాను నటించిన సినిమాల్లో ఏది ఫేవరెట్ అని ఆడగగా.. ప్రేమకథా చిత్రం అంటే బాగా ఇష్టం అని తెలిపారు. హీరోగా అయితే సప్తగిరి ఎల్‌ఎల్‌బీ ఇష్టమన్నారు.
ఇక రీసెంట్ గానే రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా పెళ్లి కాని ప్రసాద్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాతముత్తాతలు ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా'' అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అవుతోంది.












Click it and Unblock the Notifications