హీరో దర్శన్ కు షాక్, పోస్టుమార్టం నివేదిక తారుమారుకు భారీగా డబ్బులు ఆఫర్ !!
కన్నడ సినీనటుడు దర్శన్, అతడి గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడతో సహా మొత్తం 17 మందిని బెంగళూరు సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హీరో దర్శన్, ఆయన గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడతో సహ అందరిని పోలీసులు విడివిడిగా విచారించారు.
రేణుకాస్వామి పోస్టుమార్టుం రిపోర్టును తారుమారు చేసేందుకు డబ్బు ఎర వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండూరావు మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు చేసిన వ్యాఖ్యలతో హీరో దర్శన్ టీమ్ ఉలిక్కిపడింది. రేణుకాస్వామి పోస్టుమార్టం నివేదికను తారుమారు చేసేందుకు డబ్బు ఆఫర్ చేసినట్లు నా దృష్టికి రాలేదని మంత్రి దినేష్ గుండూరావ్ అన్నారు.

అలాంటిదేమైనా ఉంటే విచారణ జరిపిస్తామని, ఈ కేసును విచారించేందుకు తమను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదని మంత్రి దినేష్ గుండూరావ్ అన్నారు. రేణుకాస్వామిని దారుణంగా హత్య చేశారని, పోలీసులు నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నారని, తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడాలన్నదే మా కోరిక అని మంత్రి దినేష్ గుండూరావ్ అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో హీరో దర్శన్ అభిమానులు ఉలిక్కిపడ్డారు.
రేణుకాస్వామి హత్య కేసు నుంచి హీరో దర్శన్ తో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడను రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. హీరో దర్శన్ ను రక్షించాలని తమను ఎవరూ కలవలేదని ఇప్పటికే సీఎం సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్టార్ చంద్రును గెలిపించాలని హీరో దర్శన్ ఎన్నికల ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications