భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం వేళ వైఎస్సార్‌సీపీ వరుస ట్వీట్లు,!

ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్‌ ఛేంజర్‌గా భోగాపురం ఎయిర్‌పోర్టు నిలుస్తుందని అందరూ చెబుతున్నారు. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎవరు నిర్మించారనే దానిపై ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం తామే నిర్మించామని గొప్పగా చెప్పుకుంటూ అట్టహాసంగా భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించింది. అయితే ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వరుస పోస్టులు చేస్తోంది.

భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ కీలక ట్వీట్

జగన్‌ ప్రభుత్వంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయిందని ప్రకటించింది. ప్రధాని మోదీ పర్యటన వేళ వైఎస్సార్‌సీపీ వేసిన ట్వీట్లు వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబును క్రెడిట్ చోర్‌ అంటూ విమర్శలు చేస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హాజరై ప్రారంభించగా.. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ట్వీట్ చేసింది.

Credit Chor Babu YSRCP Viral Tweet About Bhogapuram Airport Alleges To Chandrababu As Credit Chor

ఉత్తరాంధ్ర ప్రజలు మాజీ సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్తున్నారని వైసీపీ పోస్టు

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నారని తెలిపింది. 'భోగాపురం ఎయిర్‌పోర్టుకు పునాది వేసి.. దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. అయిన్పటికీ మొత్తం ఘనతను తనదేనని చెప్పుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు' అని వరుస పోస్టులతో చెప్పింది.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదన్న వైసీపీ

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఎయిర్‌పోర్టు భూసేకరణకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారని వైఎస్సార్‌సీపీ గుర్తు చేసింది. ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చిన నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించారని, ఎయిర్‌పోర్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించారని వెల్లడించింది.

నిజమైన వైఎస్ జగన్ కల.. థ్యాంక్యూ జగనన్న అంటున్న ఆంధ్రాజనం .. వైసీపీ వీడియో

ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వైఎస్‌ జగన్ శ్రీకారం చుట్టారని.. శంకుస్థాపన కూడా చేశారని చెబుతూ ఆనాటి వీడియోలు వైఎస్సార్‌సీపీ పంచుకుంది.
'భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి శంకుస్థాపన చేసిన రోజే.. ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ ఎగురుతుందో కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఈరోజు నిజమైన వైఎస్ జగన్ కల.. థ్యాంక్యూ జగనన్న అంటున్న ఆంధ్రాజనం' అని రాసి వైఎస్సార్‌సీపీ ఓ వీడియో పోస్టు చేసింది.

జగన్ చొరవతోనే నేడు సగర్వంగా ఫస్ట్ ఫ్లైట్‌ ల్యాండ్

ఇక ఈ ఎయిర్‌పోర్టు కోసం జగన్‌ చేసిన కృషిని వివరించింది. 'భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కోసం జగనన్న చేసిన కృషి అంతాఇంతా కాదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కోర్టుల్లో అడ్డంకిలా మారిన సుమారు 130 కేసుల్ని మొక్కవోని సంకల్పంతో పరిష్కరించిన వైఎస్ జగన్. జగనన్న చూపిన ప్రత్యేక చొరవతో నేడు సగర్వంగా ఫస్ట్ ఫ్లైట్‌ ల్యాండ్ అయ్యింది' అని వైఎస్సార్‌సీపీ పోస్టు చేసింది.

మధ్యలో ఏబీ వెంకటేశ్వర రావు ఎంట్రీ

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం క్రెడిట్‌ చోరీపై తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌సీపీ మధ్య తీవ్ర చర్చ జరుగుతుండగా.. మధ్యలో మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ఎంట్రీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ పై కొట్టుకోవడం ఆపాలని ఇరు పార్టీలకు సూచించారు. ఆ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ను జీఎంఆర్‌ సంస్థకు ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ కూడా వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+