The Paradise Censor Review: నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ.. థియేటర్ల పరిస్థితి ఏంటో..??
నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ 'ది ప్యారడైజ్'.. ఎన్నోసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 24 న విడుదలకు సిద్ధం అవుతోంది. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ప్యారడైజ్ మూవీ రానున్న క్రమంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఆయా షేర్, ఏషనాగుల పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారాయి. ఎక్కడ చూసినా ప్యారడైజ్ పాటలే వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ప్యారడైజ్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ A సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. ఇక ప్యారడైజ్ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం 2 గంటల 49 నిమిషాల నిడివితో ఉంది అని తెలుస్తోంది. అంటే దాదాపు 3 గంటల పాటు నాని యాక్షన్ హంగామా అద్దిరిపోయినట్లు సమాచారం.
ఇక ప్రపంచవ్యాప్తంగా ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతుంది. అలాగే రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబర్ 23న భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 800 స్క్రీన్స్ లో ది ప్యారడైజ్ మూవీ ప్రీమియర్స్ పడబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక ప్యారడైజ్ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్ బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఏషనాగుల స్పెషల్ సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. నాని అనిరుధ్ కాంబోలో ఇది మూడో చిత్రం కావడం విశేషం. గతంలో నాని నటించిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ప్యారడైజ్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఈ మూవీలో భీకరమైన యాక్షన్ సీన్స్, రక్తపాతం, వయోలెన్స్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణ అండర్ గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో తల్లీకొడుకుల సెంటిమెంట్ ప్రధాన బలం అని సమాచారం. ఇక దసరా చిత్రంతో పోలిస్తే ప్యారడైజ్ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ మూడు రెట్లు భారీ స్థాయిలో, మరింత వైల్డ్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీపై ఇటీవల నాని మాట్లాడుతూ న 18 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇంతగా శ్రమించిన సినిమా మరొకటి లేదని అన్నారు. అలాగే ఈ మూవీలోని హింసలో కూడా ఓ భావోద్వేగం ప్రేక్షకులకు కనపడుతుందని వివరించారు. మొత్తానికి భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications
