వామ్మో ఒక్క బైక్ పై 113 చలాన్లు.. రూ. 10.68 లక్షల ఫైన్.. ట్రాఫిక్ పోలీసుల దిమ్మతిరిగింది భయ్యా..

సాధారణంగా ఓ బండిపై ఒక చలాన్ ఉంటుంది. లేదా రెండు చలాన్ లు ఉంటాయి.. మరీ అయితే ఐదారు చలాన్లు ఉంటాయి. కానీ ఓ వ్యక్తి బైక్ పై ఏకంగా 113 చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్ల ఫైన్ మొత్తం ఏకంగా రూ. 10.68 లక్షల వరకు ఉంది. హరియాణా, గురుగ్రామ్ లోని ఎండీఐ చౌక్ వద్ద పోలీసులు రెగ్యూలర్ మాదిరిగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అయితే అదే సమయంలో ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ పై అటుగా వస్తున్నాడు. అతడ్ని చూసిన ట్రాఫిక్ పోలీసులు బైక్ ను నిలిపివేశారు. హెల్మెట్ లేకపోవడమే కాకుండా బండికి సంబంధించిన డాక్యూమెంట్స్ కూడా అతనివద్ద లేవు. దాంతో అతడ్ని బైక్ నెంబర్ తో యాప్ లో చెక్ చేయగా పెద్ద లిస్టే వచ్చింది. ఆ బండిపై ఏకంగా 113 చలాన్లు ఉన్నట్లు రావడంతో ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మొత్తం చలాన్ల విలువ చూస్తే ఏకంగా రూ. 10.68 లక్షలుగా తేలింది.

మోటార్ వెహికల్స్ యాక్ట్-1988 ప్రకారం వివిధ సందర్భాల్లో ఈ చలాన్లు విధించినట్లు స్పష్టం అవుతోంది. ఇన్ని చలాన్లతో పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరిగుతున్న ఆ వ్యక్తి ఎట్టకేలకు చిక్కడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.

Gurugram news 113 traffic challans issued against a single bike resulting in a fine of 10 68 lakh

ఇక ఇటీవలి కాలంలో గురుగ్రామ్ లో సీసీ కెమెరాలను అత్యధికంగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘన ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే వాహనదారులపై ఉక్కుపాదం మోపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ మేరకు తనిఖీలను ముమ్మరం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇటీవలికాలంలో పెండింగ్ చలాన్ల చిట్టా కొండలా పేరుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలను కలిపి ట్రాఫిక్ చలాన్ల ఫైన్ లు కట్టని జరిమానాల సంఖ్య వేల కోట్ల రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+