పొన్నగంటి కూర రోటి పచ్చడి.. ఇది బరువు తగ్గించే ఆరోగ్య అమృతం!

మనం ఆహారంలో రోటి పచ్చళ్ళను భాగంగా చేసుకుంటే చాలా మంచిది. రోటి పచ్చళ్ళు మన నోటికి కొత్త రుచిని అందించటం మాత్రమే కాదు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటానికి కూడా దోహదం చేస్తాయి. అటువంటి రోటి పచ్చళ్ళలో పొన్నగంటి కూర రోటి పచ్చడి ఒకటి.

పొన్నగంటి కూర ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు మందు

పొన్నగంటి కూరను ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు మందుగా చెబుతారు. పూర్వం నుంచి పెద్దలు కంటిచూపు మందగించకుండా ఉండటానికి, చర్మానికి కాంతి రావడానికి ఈ ఆకును తప్పనిసరిగా తినేవారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలో, ఎముకలను దృఢపరచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

Ponnaganti Kura Roti Pachadi Know how to make healthy tasty Ponnaganti Kura Roti Pachadi

కావాల్సిన పదార్థాలు:

శుభ్రం చేసిన పొన్నగంటి ఆకు- 200 గ్రాములు,
నూనె - 2-3 టీస్పూన్లు
మెంతులు - పావు టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
తెల్ల నువ్వులు- 2-3 టేబుల్ స్పూన్లు
ఎండుమిరపకాయలు -4
పచ్చిమిరపకాయలు - 6
చిటికెడు పసుపు,
రుచికి సరిపడా ఉప్పు,
వెల్లుల్లి రెబ్బలు- 5
చిన్న నిమ్మకాయ సైజు చింతపండు,
తాలింపు గింజలు- ఒక టీ స్పూన్
చిటికెడు ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు- 1 కట్ చేసినది.

తయారీ విధానం:

ముందుగా పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేడి చేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తర్వాత తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేపాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి పొన్నగంటి ఆకును వేసి ఉప్పు, పసుపు కలిపి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.

ఈ రోటి పచ్చడి ఇలా చేస్తే సూపర్

చల్లారిన తర్వాత ముందు వేయించిన దినుసులు, మిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు కలిపి రోటి పచ్చడిలా బరకగా దంచుకోవాలి. చివరగా నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి తాలింపు చేసి పచ్చడిలో కలపాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో కలిపి తింటే సూపర్ గా ఉంటుంది. రుచికి, ఆరోగ్యానికి బాగుంటుంది.

ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా.. ఇలా సింపుల్ గా చేసి చూడండి!
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా.. ఇలా సింపుల్ గా చేసి చూడండి!

వారానికి రెండు,మూడు సార్లు తింటే హెల్త్ కి బెస్ట్

ఈ పచ్చడిని వారానికి రెండు మూడు సార్లు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. సాధారణ ఆకుకూరల్లా కాకుండా ఇది ఔషధ గుణాలు కలిగిన ఆహారం. కనుక ఈ ఆకుకూర పచ్చడిని చేసుకుని తినటం అసలే మరచిపోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+