నేడు లక్ష్మీదేవి కటాక్షంతో కుంభం, తులతో పాటు ఈ రాశులవారి పంట పండుతుంది!
నేడు సెప్టెంబర్ 18 శుక్రవారం. లక్ష్మీదేవి ఆరాధనకు అనుకూలమైన రోజు. భాద్రపద శుక్ల పక్ష సప్తమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం, ప్రీతి యోగం కలయికతో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా కుంభం, తుల రాశులవారికి వ్యాపారంలో పెద్ద డీల్స్, ధన లాభాలు కనిపిస్తున్నాయి. నేడు గ్రహాల స్థితిని బట్టి ద్వాదశ రాశులవారి జాతకం ఎలా ఉందో చూద్దాం.
మేషం: మేషరాశి జాతకులకు వ్యాపారంలో ప్రయాణాలు పెరగవచ్చు. ఆర్థికంగా కాస్త జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
వృషభం: నేడు వృషభరాశి జాతకులకు వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కెరీర్‌లో కొత్త ఆలోచనలు మెప్పు పొందుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. ఆస్తిలో పెట్టుబడి ఆలోచన రావచ్చు.
మిథునం: మిథునరాశి జాతకులకు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. ధనలాభం బలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం: కర్కాటక రాశి జాతకులు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త. కుటుంబంలో పాత వివాదాలు తీరవచ్చు. ఆర్థికంగా నష్టాలు లేకుండా జాగ్రత్తపడండి.
సింహం: సింహరాశి జాతకులు నేడు మీ నిర్ణయాలలో పెద్ద మార్పులు చేయకండి. కుటుంబంలో మీ మాటలు పట్టించుకోకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త.
కన్య: కన్యా రాశి జాతకులకు వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయి. మార్గదర్శకుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా సమతుల్యత ఉంటుంది.
తుల: తులారాశి జాతకుల వ్యాపారంలో బంపర్ లాభాలు ఉంటాయి. కెరీర్‌లో గుర్తింపు పెరుగుతుంది. కుటుంబంలో కొత్త సభ్యుల రాకతో సంతోషం ఉంటుంది. ఆర్థికంగా బలమైన యోగాలు ఉన్నాయి.
వృశ్చికం: వృశ్చికరాశి వారికి పెద్ద రిస్కులు తీసుకోకండి. కుటుంబంలో ఆస్తి విషయాల్లో చర్చలు రావచ్చు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
ధనస్సు: ధనుస్సురాశి జాతకులకు వ్యాపారంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది. మాటల్లో జాగ్రత్త ఉండాలి. ఆర్థికంగా అనవసర ఖర్చులు తగ్గించండి. మానసిక ఒత్తిడి ఉండవచ్చు.
మకరం: మకరరాశి జాతకులకు వ్యాపారంలో పెద్ద లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలమైనస్థితి ఉంది..
కుంభం: కుంభరాశిలో వ్యాపారంలో పెద్ద డీల్ అవకాశం ఉంది. కెరీర్‌లో మీ నిర్ణయాలు మెప్పు పొందుతాయి. ఆస్తి కొనుగోలు ఆలోచన రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం: మీనరాశి జాతకులకు పెద్ద మార్పులు చేయకండి. అపరిచితులకు అప్పు ఇవ్వకండి. కుటుంబంలో అభిప్రాయభేదాలు ఉండవచ్చు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
