మై ఫ్రెండ్ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పోస్ట్ వైరల్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచ దేశాల అధినేతలు కూడా ప్రధాని మోదీపై తమ అభిమానాన్ని, ప్రేమను, స్నేహాన్ని చాటుకుంటూ ఉంటారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే ప్రధాని మోదీని అభిమానించే ప్రపంచ దేశాల అధినేతల్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఒకరన్న సంగతి తెలిసిందే. మోదీ- మెలోని ఎప్పుడు భేటీ అయినా చాలా సరదాగా ఫ్రెండ్స్ మాదిరిగానే మాట్లాడుకుంటారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందుకే మోదీ- మెలోడీ జంటను సోషల్ మీడియాల్లో మెలోడి అని నెటిజన్లు పిలుచుకుంటూ ఉంటారు.

ఇక ఈ ఏడాది జూన్ లో జీ 7 సమ్మిట్ లో భాగంగా ప్రధాని మోదీ.. ఇటలీ ప్రధాని మెలోని మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాక మెలోనికి మెలోడి టాఫీ బ్రాండ్ ప్యాకెట్ ను ప్రధాని మోదీ బహుమతిగా అందించారు. ఈ క్రమంలో గతంలో వైరల్ అయిన మెలోడి పేరును సరదాగా గుర్తు చేస్తూ ఇచ్చిన ఈ గిఫ్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రనేతల నుంచి మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Buon compleanno al mio amico @narendramodi, a cui auguro salute, energia e successo.
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2026
Italia e India continuano a rafforzare il loro profondo legame di amicizia, costruendo insieme un futuro di cooperazione e prosperità per le nostre Nazioni.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. " హ్యాపీ బర్త్ డే టూ మై ఫ్రెండ్ నరేంద్ర మోదీ.. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా అలాగే విజయంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇటలీ- భారత్ మధ్య సత్సంబంధాలు మరింత దృఢంగా మారాలని కోరుకుంటున్నాను. ఇరు దేశాల భవిష్యత్తు తరాలకు సహకారం, సౌభాగ్యం అందించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను" అని తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. ఇక గతేడాది మే నెలలో ప్రధాని మోదీ ఇటలీలో పర్యటించారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై నిర్ణయాలు కుదిరాయి.












Click it and Unblock the Notifications
