హాస్పిటల్ బెడ్‌పై కదలలేని స్థితిలో ప్రభాస్..వేణు స్వామి చెప్పిందే నిజమైందా..?

డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా 'బహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్‌కు ఫిదా అయిపోయారు. 'సాహో' సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో నిరాశ పర్చిన ప్రభాస్, సలార్, కల్కి వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్-2,ఫాజీ కల్కి-2 ,సినిమాల్లో నటిస్తున్నాడు.

దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆయన నటిస్తూన్న 'రాజాసాబ్' సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి అయింది.ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ లుక్ వేస్తే.. ఆయన చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. బయట పెద్దగా కనిపించరు. తన సినిమా ఫంక్షన్స్‌లో మాట్లాడానికే ఆయన సిగ్గపడుతుంటారు. కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్‌కు తీవ్ర గాయం అయిందని ఈ వార్త సారాంశం.

It is reported that Prabhas underwent surgery in Italy after sustaining a leg injury

ప్రభాస్‌కు తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారి పడిపోవడంతో , కాలుకు తీవ్ర గాయం అయిందని, అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రభాస్ పీఆర్ టీం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేక ఏదైన ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నారని సమాచారం. 'బాహుబలి' సమయంలో కూడా ప్రభాస్‌కు అనేక గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో అతని కాలుకు ఐరన్ రాడ్ వేయడం జరిగింది.

గతంలో గాయం అయిన చోటే ప్రభాస్‌కు తిరిగి గాయం కావడంతో పాటు, కాలులో ఉన్న ఐరన్ రాడ్ బ్రేక్ అవ్వడంతో సమస్య మరింత తీవ్రతరం అయిందని తెలుస్తోంది ప్రభాస్ కాలు నరాలు దారుణంగా దెబ్బ తిన్నాయట. ఫిబ్రవరి 28న ఇటలీలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆస్పత్రిలో ప్రభాస్‌కు సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రభాస్‌కు ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ప్రభాస్‌ ఆరోగ్యం గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గతంలో ప్రభాస్ ఆరోగ్యంపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ప్రభాస్‌కు పెద్ద సర్జరీ జరిగిందని..అతను ఇండియాలోనే లేడని.. మీడియాకు సైతం ప్రభాస్‌కు సర్జరీ జరిగిందనే విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డారని వేణు స్వామి పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ప్రభాస్‌కు కాలు సర్జరీ కావడం విశేషం. ప్రభాస్‌ కాలుకు గాయం అయిందనే విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్..తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా ఉందో అని అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+