ఒకరు, ఇద్దరు కాదు..ఏకంగా ముగ్గురికి టెండర్ పెట్టింది..!

శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, కేవలం నటనతోనే కాకుండా, తన అద్భుతమైన అందం, అపురూపమైన ఆకర్షణతో సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఆమె ప్రతి లుక్, ప్రతి ఫోటోషూట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెడిషనల్ చీరలో అయినా, మోడరన్ డ్రస్సుల్లో అయినా, జాన్వీ తన గ్లామర్‌తో యువతరాన్ని ఆకర్షిస్తున్నారు. ఆమె అందం, ఆత్మవిశ్వాసం కలగలిపి ఆమెను ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా మార్చాయి.

జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. తెలుగులో మాత్రం తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Janhvi Kapoor From Bollywood to Tollywood A New Era of Stardom

ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.

తాజాగా కపిల్ శర్మ షోలో మాట్లాడుతూ జాన్వీ, తన పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి కారణం తన లక్కీ నంబర్ మూడు అని చెప్పారు. అంతేకాకుండా, ఇద్దరు పిల్లల మధ్య గొడవలు జరిగినప్పుడు మూడో బిడ్డ వాటిని ఎలా పరిష్కరిస్తారో చూడాలని ఉందని, అది చాలా ఫన్నీగా ఉంటుందని ఆమె అన్నారు. పిల్లలు ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండేలా పెరగాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.

దక్షిణాది అంటే జాన్వీ కపూర్‌కు చాలా ఇష్టం. ముఖ్యంగా తిరుపతిలో స్థిరపడాలని ఆమె కోరుకుంటున్నారు. ఈ కోరికను గతంలో కూడా పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తిరుమలను సందర్శించింది జాన్వీ. అంతేకాకుండా, విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి యువత ఫాలోయింగ్ నుంచి తప్పించుకోవడానికి, తనకు ఇప్పటికే పెళ్లయిందని చెప్పినట్లు కూడా జాన్వీ నవ్వుతూ పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె తన కొత్త సినిమా 'పరం సుందరి' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+