బాలకృష్ణ సినిమాను రీమేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తరం కథానాయకుల్లో ఎవరూ లేనంత బిజీగా ఉంటున్నారు. అంతేకాదు వరుసపెట్టి సూపర్ హిట్లు కొడుతున్నారు. తాజాగా బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఇది విజయదశమికి విడుదల కానుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దీనికి దర్శకుడు. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. మొదటి భాగాన్ని ఈ ఏడాదే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో భైరవ ద్వీపం సినిమా గురించి చర్చ పెట్టారు.
భైరవద్వీపం సినిమాను ప్రస్తుత తరంలో రీమేక్ చేస్తే చేయగలిగే నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని, ఆ కథకు అనుగుణంగా గ్రాఫిక్స్ ను కూడా సిద్ధం చేసుకునే దర్శకుడు దొరికితే అద్భుతంగా రూపొందుతుందని బాలయ్య అభిమానులు అంటున్నారు. ఆ తరహా పాత్ర కూడా ఎన్టీఆర్ ఒక్కడే సరిపోతాడంటున్నారు. అయితే బాలయ్యకు, తారక్ కు విభేదాలు కొనసాగుతున్నాయంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఎన్టీఆర్ అయితేనే ఈ సినిమా రీమేక్ కు బాగుంటుంది అని అంటుండటంతో వారి మాటలు మన్నించి బాలయ్య సైలెంటయ్యాడంటున్నారు. లేదంటే దీనిపై ఏదో ఒకవిధమైన వ్యాఖ్యలైతే బాలయ్య నుంచి వచ్చేవంటున్నారు.

అభిమానుల ఇష్టాన్ని కాదనలేక బాలయ్య మౌనంగా ఉంటున్నారు. తారక్ కూడా భవిష్యత్తులో బాలయ్యకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి. భైరవ ద్వీపం ప్రాజెక్టును ఎన్టీఆర్ చేయాలన్నా దాన్ని సరిగ్గా డీల్ చేయగలిగే దర్శకుడు కావాలని, అటువంటి దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సందేహాస్పదంగా ఉందని, భవిష్యత్తులోనైనా ఏ డైరెక్టర్ అయినా ముందుకు వస్తాడేమో చూడాలి. బాలయ్య సినిమాను తారక్ రీమేక్ చేస్తే ఇద్దరు అభిమానులకు పండగే పండుగ అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications