ఒక్క సినిమాకే ఆ కోరిక తీరింది అంటున్న బ్యూటీ.. ఇక నెక్ట్స్ అదేనా..!

శ్రీదేవి అంటే ఎవరూ గుర్తుపట్టరేమో గానీ.. కోర్టు మూవీ జాబిలి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ జాబిలి. ఈ మూవీలో తన నటనతో యువతను ఆకట్టుకున్నారు కాకినాడ శ్రీదేవి. ఈ మూవీలో హీరోగా ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. యువ నటీనటులతో పాటు ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి, ప్రముఖ నటుడు సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ కోర్ట్ మూవీలో తన అందం, అమాయకత్వం, యాక్టింగ్‌ తో ఇరగదీశారు హీరోయిన్ శ్రీదేవి. ఫస్ట్ మూవీలోనే జాబిలి పాత్రలో తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేశారు. అయితే తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయడంతో అమ్మడి రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఓ తమిళ్ సినిమాకు ఓకే చెప్పింది. దీంతో త్వరలో తమిళంలోనూ మెప్పించనున్నారు ఈ బ్యూటీ.

అయితే తాజాగా ఈ అమ్మడు లగ్జరీ కారు కొనేసింది. తన ఫ్యామిలీ మెంబర్స్‌ తో కలిసి లగ్జరీ కారు వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. కారు కొనడం తన డ్రీమ్ అంటూ 'ఎంజీ కారును' పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. తొలి సినిమాకే కారు కొనేసింది అంటే.. రెండో సినిమాకు ఇల్లు కొనేస్తుంది అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. కోర్ట్ మూవీని నేచురల్ స్టార్ నాని రూ.10 కోట్లతో నిర్మించారు. అయితే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు... శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేక సుధాకర్ కీలక పాత్రలు పోషించారు.

Kakinada s Sridevi Splurges on Luxury Car After Court Blockbuster Success

శ్రీదేవి పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల కాగా.. ఆమెది ఏపీలో కాకినాడ సొంతూరు. తల్లిదండ్రులిద్దరూ రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడడంతో.. ఆమె సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదే ఆమెకు కోర్ట్ మూవీలో ఛాన్స్ తెచ్చిపెట్టింది. ఆమె వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తాను చేసిన రీల్స్, ఫోటోస్ షేర్ చేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+